iDreamPost

ఎత్తైన కొండపై నుంచి కింద పడ్డ తారక్ హీరోయిన్.. బ్రెయిన్ డ్యామేజ్ కావడంతో..

షూటింగులన్నాక రిస్కీ షాట్స్ చేయడం.. వాటి కారణంగా గాయాలు అవ్వడం మామూలే. తారక్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. అయితే తారక్ హీరోయిన్ ఎత్తైన కొండపై నుంచి జారిపడడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది.

షూటింగులన్నాక రిస్కీ షాట్స్ చేయడం.. వాటి కారణంగా గాయాలు అవ్వడం మామూలే. తారక్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. అయితే తారక్ హీరోయిన్ ఎత్తైన కొండపై నుంచి జారిపడడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది.

ఎత్తైన కొండపై నుంచి కింద పడ్డ తారక్ హీరోయిన్.. బ్రెయిన్ డ్యామేజ్ కావడంతో..

తారక్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తారక్ మాస్ లుక్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా?.. కాలర్ ఎప్పుడెప్పుడు ఎగరేద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తారక్ సరసస జాన్వీకపూర్ కూడా బాగా సెట్ అయ్యింది. బాలీవుడ్ వాళ్ళు చూపించిన జాన్వీకి.. మనోళ్లు చూపిస్తున్న జాన్వీకి చాలా తేడా కనిపిస్తుంది. అచ్చ తెలుగమ్మాయిలా జాన్వీ ఇంప్రెసివ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడం.. ఆచార్య తప్పితే అపజయమంటూ ఎరుగని డైరెక్టర్ కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమాలన్నాక షూటింగ్ సమయంలో గాయాలు అవ్వడం మామూలే కదా. చాలా మంది హీరోలు సీన్ బాగా రావడం కోసం రిస్కీ షాట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో గాయాలపాలవుతారు. హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా కొన్ని సార్లు రిస్క్ చేస్తుంటారు. ఈ క్రమంలో గాయాలైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే తారక్ హీరోయిన్ కి కూడా షూటింగ్ సమయంలో గాయమైందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. తారక్ తో కలిసి కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆమె పేరు తానీషా ముఖర్జీ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లీడ్ హీరోయిన్ గా.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. హిందీ బిగ్ బాస్ ఏడవ సీజన్ లో కూడా పాల్గొంది.

Tarak heroine who does not count injuries

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి వెల్లడించింది. తన మొదటి సినిమా ‘ష్’ షూటింగ్ లో భాగంగా ఓ ఎత్తైన కొండపై సీన్ చిత్రీకరిస్తున్నారని.. ఆ సమయంలో తాను ఆ ఎత్తైన కొండపై నుంచి జారి కింద పడ్డానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన తలకు బలమైన గాయమైందని చెప్పుకొచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని అన్నారని.. సంవత్సరం పాటు హాస్పిటల్ కి వెళ్తూ చికిత్స చేయించుకున్నా అని తానీషా వెల్లడించింది. మామూలు స్థితికి రావడానికి ఏడాది పట్టిందని.. అయితే అప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె చెప్పుకొచ్చింది. అదే మొదటి సినిమా కాబట్టి.. చెప్తే ఎక్కడ తనను సినిమాలోంచి తొలగిస్తారో అన్న భయంతో బ్రెయిన్ డ్యామేజ్ విషయాన్ని దాచానని చెప్పుకొచ్చింది.

ఆ గాయంతో బాధపడుతూనే షూటింగ్ లో పాల్గొనేదాన్నని.. రెండు గంటలు షూట్ జరిగితే మూడు గంటలు రెస్ట్ తీసుకునేదాన్నని వెల్లడించింది. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా ఉండలేకపోయానని.. కానీ ప్రొడ్యూసర్స్ తనకెంతగానో సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చింది. ప్రమాదం తర్వాత తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయానని.. బరువు కూడా పెరిగానని ఆమె వెల్లడించింది. సినిమాలో కొన్ని చోట్ల ఎక్స్ ప్రెషన్స్ వేగంగా పలికించలేకపోయానని.. దీంతో తనకు యాక్టింగ్ రాదని కొంతమంది విమర్శించారని చెప్పుకొచ్చింది. అయితే వారికి తన తలకు గాయమైన విషయం తెలియదని వెల్లడించింది. మరి గాయమైనా సరే లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్న తారక్ హీరోయిన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి