iDreamPost

పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్‌కు పెత్తనం ఇచ్చారు.. తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్‌కు పెత్తనం ఇచ్చారు.. తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తో జనంలో భారీ స్పందన వస్తుందని టీడీపీ నేతలు అనుకున్నారు. అలా కాకపోగా.. చంద్రబాబు జైల్లో ఉండటంతో ఆ పార్టీ పరిస్థితి  అగమ్యగోచరంగ మారిందని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ వాయిస్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్  మారారు. చంద్రబాబు అరెస్టై తీవ్రంగా స్పందించడంతో పాటు.. ఇరు పార్టీల బాధ్యతలు తానే తీసుకున్నట్లు పవన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్ కి పెత్తనం ఇచ్చారని తనకు ఓ టీడీపీ కార్యకర్త చెప్పినట్లు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్.. ఈ పేరు గురించి  తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిర్మాత, దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినీ, రాజకీయ రంగాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తుంటారు. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై అనేక సార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు ఓ టీడీపీ కార్యకర్త చెప్పిన విషయాలను వెల్లడించారు.  తమ్మారెడ్డి మాట్లాడుతూ..” ఇటీవల నన్ను ఓ టీడీపీ అభిమాని కలిశారు. చంద్రబాబు బయటకు వస్తారు. మీకు బాగా సింపతి వచ్చింది. మీకు గెలిచే అవకాశం ఉంది కదా? అని నేను అన్నాను. ఆ ప్రశ్నకు ఆ టీడీపీ అభిమాని చాలా నిరాశగా సమాధానం ఇచ్చారు.

అతడు చెబుతూ.. ప్రస్తుతం టీడీపీని చూస్తుంటే మాకు ఏమి అర్ధం కావడంలేదు. చంద్రబాబు అరెస్ట్.. వైసీపీ సూసైడ్ అనుకున్నాము.  అలానే చంద్రబాబు  జైల్లోకి వెళ్లరు.. ఒక వేళ వెళ్తే..పార్టీలోని నేతలు అందరూ కలసి వస్తారని భావించాము. అయితే మా కార్యకర్తల్లో స్పందన వచ్చింది కానీ  పార్టీలో స్పందన రాలేదు. టీడీపీలోని ప్రతి నాయకుడిలో అసలు ఎమోషన్ లేదు. ఇలాంటి స్థితిలో మేము ఉంటే నేను ఉన్నానంటూ పవన్ కల్యాణ్ వచ్చారు. మొత్తం ఆయనే చూసుకుంటాను అంటున్నారు. ఆయన అంతట ఆయనే గెలవలేని వ్యక్తి , అందులోనూ టీడీపీ సపోర్టు చేస్తే తప్ప గెలవలేడు.  వారాహి యాత్ర ప్రారంభానికి ముందే చంద్రబాబు నాయుడు, పవన్ మాట్లాడుకుని కలిసి యాత్ర చేసి ఉంటే బాగుండేది.

ఇప్పుడు వచ్చే సరికి  టీడీపీ నాయకత్వం ఎవ్వరూ మాట్లాడటం లేదు. పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్ కు పెత్తనం ఇచ్చారు.  మేము ప్రజల్లోకి వెళ్తే.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీకు ఏ దిక్కులేక తమ నాయకుడిని ఎన్నుకున్నట్లు ఆయ జనసేన కార్యకర్తలు కొందరు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉందంటూ టీడీపీ అభిమాను ఆవేదన వ్యక్తం చేశాడు” అని తమ్మారెడ్డి అన్నారు.  అయితే అతడి ఆవేదనలో అర్థం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ్ అభిప్రాయ పడ్డారు. మరి.. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి