iDreamPost

ప్రధాని రిక్వెస్ట్‌.. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌

  • Published Jul 08, 2023 | 1:29 PMUpdated Jul 08, 2023 | 1:29 PM
  • Published Jul 08, 2023 | 1:29 PMUpdated Jul 08, 2023 | 1:29 PM
ప్రధాని రిక్వెస్ట్‌.. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌కి ముందు రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలనం సృష్టించాడు బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌. మరి కొన్ని నెలల్లో ఆసియా కప్‌ 2023తో పాటు వన్డే వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో ఇక్బాల్‌ రిటైర్మెంట్‌ ప్రకటన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ఆడుతోంది. తొలి వన్డేలో తమీమ్‌ కెప్టెన్సీలో బంగ్లా గెలిచింది. అయినా కూడా..  మ్యాచ్‌ తర్వాత మీడియా ముందుకు వచ్చిన తమీమ్‌.. అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటన చేసి ఎమోషనల్‌ అయ్యాడు.

ఇదే తనకు చివరి మ్యాచ్‌ అని, తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించాడు. తమీమ్‌ రిటైర్మెంట్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు కూడా ఆమోదించింది. అయితే.. తమీమ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయంతో బంగ్లా క్రికెట్‌ అభిమానులు నిరాశచెందారు. దీంతో ఏకంగా బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా రంగంలోకి దిగారు.

ప్రధానితో భేటీకి రావాల్సిందిగా తమీమ్‌ ఇక్బాల్‌కు ప్రధాని కార్యాలయం సమాచారం అందించింది. భార్యతో పాటు ప్రధానిని కలిసిన తమీమ్‌ ఇక్బాల్‌ భేటీ తర్వాత తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సమావేశంలో బంగ్లా క్రికెటర్‌ మోర్తాజా, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ సైతం పాల్గొన్నారు. మొత్తానికి ప్రధాని చోరవతో తమీమ్‌ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ బరిలో దిగనున్నాడు. మరి తమీమ్‌ యూటర్న్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి