iDreamPost

వీడియో: శార్దుల్ ఠాకూర్‌ సూపర్‌ సెంచరీ! తర్వాత మాస్‌ సెలబ్రేషన్స్‌

  • Published Mar 04, 2024 | 1:41 PMUpdated Mar 04, 2024 | 1:41 PM

టీమిండియా ఆల్​రౌండర్ శార్దుల్ ఠాకూర్ అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు.

టీమిండియా ఆల్​రౌండర్ శార్దుల్ ఠాకూర్ అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు.

  • Published Mar 04, 2024 | 1:41 PMUpdated Mar 04, 2024 | 1:41 PM
వీడియో: శార్దుల్ ఠాకూర్‌ సూపర్‌ సెంచరీ! తర్వాత మాస్‌ సెలబ్రేషన్స్‌

క్రికెట్​లో పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్లకు మంచి గిరాకీ ఉంటుంది. బ్యాటింగ్​తో పాటు కొన్ని ఓవర్ల పాటు పేస్ బౌలింగ్ వేసి బ్రేక్ త్రూలు అందించే వారి కోసం అన్ని టీమ్స్ వెతుకులాడతాయి. వన్డేలు, టీ20లు, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్స్ ఉంటే టీమ్స్ పటిష్టంగా తయారవుతాయి. అయితే టీమిండియాలో మాత్రం వీరి కొరత ఎప్పటి నుంచో ఉంది. హార్దిక్ పాండ్యా రూపంలో మంచి ప్లేయర్ ఉన్నా ఎప్పుడూ గాయాలతో సావాసం చేస్తుంటాడతను. దీంతో శార్దూల్ ఠాకూర్​ను ఆ ప్లేస్​కోసం టీమ్ చాలాసార్లు ఉపయోగించింది. అతడు కూడా కీలక వికెట్లు తీస్తూ, విలువైన రన్స్ జోడిస్తూ టీమ్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. మరోమారు సత్తా చాటాడు శార్దూల్. రంజీ ట్రోఫీ సెమీఫైనల్​లో సెంచరీతో చెలరేగాడు.

రంజీ ట్రోఫీ-2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న సెమీస్​లో శార్దుల్ ఠాకూర్ (109) అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో తన టీమ్​కు మంచి స్కోరు అందించాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన తమిళనాడు ఫస్ట్ ఇన్నింగ్స్​లో 146 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలింగ్​లో 4 వికెట్లు తీసిన శార్దుల్.. బ్యాట్​తోనూ విధ్వంసం సృష్టించాడు. 106 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైని ఒంటిచేత్తో గట్టెక్కించాడు. అటాకింగ్ బ్యాటింగ్​తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. 13 బౌండరీలు బాదిన శార్దుల్.. 4 భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. అతడికి తనుష్ కొటియన్ (89 నాటౌట్) మంచి సహకారం అందించాడు. చివర్లో తుషార్ దేశ్​పాండే (26) కూడా బ్యాట్ ఝళిపించడంతో ముంబై 378 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

ముంబై ఇన్నింగ్స్​లో శార్దుల్ బ్యాటింగ్ స్పెషల్ హైలైట్ అని చెప్పాలి. టపటపా టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలడంతో క్రీజులోకి వచ్చిన అతడు.. టెయిలెండర్ల సహకారంతో తమిళనాడు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టేలా చేశాడు. ఈ క్రమంలో భారీ సిక్స్​తో సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. శతకం తర్వాత మాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రెండు చేతులతో గాల్లోకి పంచ్​లు విసురుతూ సాధించానంటూ అరించాడు. అంతటితో ఆగిపోలేదు శార్దుల్. అనంతరం బంతిని చేతబట్టి అపోజిషన్ టీమ్ బ్యాటర్ల పనిపట్టాడు. తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్ (5), నారాయణ్ జగదీసన్ (0)ను అతడు వెనక్కి పంపాడు. ఈ మ్యాచ్​లో తమిళనాడు 175 పరుగులతో వెనుకబడి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముంబై ఫైనల్​కు వెళ్లడం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది. మరి.. శార్దుల్ మెరుపు ఇన్నింగ్స్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి