iDreamPost

షాకింగ్: రాజ్ భవన్ ఎదుట బాంబ్ విసిరిన యువకుడు!

ఇటీవల పలు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది రాజకీయ నేతలను, సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు.

ఇటీవల పలు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది రాజకీయ నేతలను, సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు.

షాకింగ్: రాజ్ భవన్ ఎదుట బాంబ్ విసిరిన యువకుడు!

తమిళనాడులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఏకంగా రాజ్ భవన్ ఎదుట పెట్రోల్ బాంబ్ విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు ఆ నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ భవన్ సమీపంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. ఇక ఎట్టకేలకు పోలీసులు బాంబు విసిరిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు చెందిన కారుక వినోద్‌ అనే యువకుడు ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబ్ విసిరి అక్కడి నుంచి పరాయ్యాడు. ఉన్నట్టుండి అక్కడ ఆ బాంబ్ కనిపించడంతో పోలీస్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై ఆ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా రాజ్ భవన్ లోనే పెట్రోల్ బాంబ్ కనిపించడంతో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే రాజ్ భవన్ సమీపంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. అంతే కాకుండా అసలు బాంబ్ విసిరింది ఎవరు? ఎందుకు విసిరాడు అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఇందులో భాగంగానే ఆ నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా విడిపోయారు. ఇక ఎట్టకేలకు పోలీసులు నిందితుడు కారుక వినోద్‌ ను తాజాగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్ భవన్ ఎదుట పెట్రోల్ బాంబ్ విసరడం అనేది రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఇంతకు ఆ దుండగుడు రాజ్ భవన్ లోకి ఆ బాంబ్ ఎందుకు విసిరాడనేది తెలియ రాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి