iDreamPost

ఆ కారణంతోనే అతడిపై మనసు పడ్డా.. మరోసారి ప్రియుడిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా

  • Author Soma Sekhar Updated - 07:51 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Updated - 07:51 PM, Tue - 4 July 23
ఆ కారణంతోనే అతడిపై మనసు పడ్డా.. మరోసారి ప్రియుడిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా

తమన్నా-విజయ్ వర్మ.. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పేర్లు. ఎట్టకేలకు మిల్కీ బ్యూటి తన ప్రియుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అదీకాక లస్ట్ స్టోరీస్ 2లో అతడితో కలిసి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ క్రమంలోనే తన ప్రియుడు విజయ్ వర్మ గురించి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తమన్నా మిల్కీ బ్యూటీగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సీనియర్ హీరోలందరి సరసన నటిస్తూ.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. అయితే ఈ సిరీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో తన ప్రియుడిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్నా.. మరోసారి తన లవర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “నా భావాలను గౌరవించే అద్భుతమైన వ్యక్తి నాకు దొరికాడు. విజయ్ జీవితాన్ని ఎంతో మంది మహిళలు ప్రభావితం చేశారని నేను నమ్ముతున్నాను. అతడు నా జీవితంలోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే నా హృదయానికి దగ్గరయ్యాడు ” అంటూ తన ప్రియుడిపై ప్రేమను ఒళకబోసింది మిల్కీ బ్యూటీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి