iDreamPost

Khiladi : రవితేజ వెనుకడుగు వేయక తప్పదా ?

Khiladi : రవితేజ వెనుకడుగు వేయక తప్పదా ?

మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా ఖిలాడీ ఈ నెల 11 విడుదల గురించి యూనిట్ మాట మార్చడం లేదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు వాయిదా వేయొచ్చని అంటున్నారు. ఏపిలో నైట్ కర్ఫ్యూ 14 దాకా ఉంటుంది. అందుకే సెకండ్ షోలు వేయడం సాధ్యపడటం లేదు. ఒకవేళ ఉదయాన్నే 8 నుంచి 9 మధ్యలో ఒక ఆట ప్రదర్శించాలన్నా అంత ఉదయాన్నే బిసి సెంటర్ జనాలు హాలుకు రారు. 11 గంటల తర్వాతే పబ్లిక్ ని ఆశించొచ్చు. పాన్ ఇండియా సినిమాలు ఈ ట్రెండ్ కి అతీతంగా ఆడతాయి కానీ మిగిలివాటికి కష్టమే. ఖిలాడీ భారీ బడ్జెట్ అయినప్పటికీ మరీ ఆర్ఆర్ఆర్ తో పోల్చేది కాదుగా. అందుకే ఆలోచించాలి.

ఈ నేపథ్యంలో ఖిలాడీ 11 నుంచి 18కి షిఫ్ట్ అవ్వొచ్చని అంటున్నారు. ఇంకా ట్రైలర్ రిలీజ్ జరగలేదు. సినిమాలో నటించిన పాత్రధారులను క్యారెక్టర్ పోస్టర్ల ద్వారా రివీల్ చేస్తున్నారు కానీ అవేమాత్రం ఆసక్తి కలిగించడం లేదు. అభిమానులు ట్రైలర్ నే డిమాండ్ చేస్తున్నారు. పాటలైతే అయిదు దాకా యుట్యూబ్ లో లిరికల్ రూపంలో వచ్చేశాయి. మొత్తానికి అటుఇటుగా ఖిలాడీ ఓ అడుగు వెనక్కు తగ్గడం తప్పేలా లేదు. దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోటి రూపాయల కారుని బహుమతిగా ఇచ్చారంటే అవుట్ ఫుట్ మీద ఏ రేంజ్ లో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రమోషన్ డిఫరెంట్ గా చేయాల్సింది.

ఒకవేళ ఖిలాడీ డ్రాప్ అయితే ఆ స్థానంలో డిజె టిల్లుతో పాటు సెహరి అనే మరో చిన్న సినిమా వచ్చేస్తాయి. రెండోది డేట్ ఇచ్చింది కానీ డిజె మాత్రం ఇంకా అధికారిక తేదీ చెప్పలేదు. అదే రోజు విష్ణు విశాల్ నటించిన తమిళ డబ్బింగ్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. దానికి రవితేజ సపోర్ట్ ఉండటం గమనార్హం. ఇవన్నీ విశ్లేషించుకుంటే ఖిలాడీ 11న రావడం దాదాపు లేనట్టే. మళ్ళీ 18 మిస్ చేసుకుంటే 25న విపరీతమైన పోటీ నెలకొంది. సో అయితే 11 లేదా 18 రెండు ఆప్షన్లే పెట్టుకోవాలి. గత ఏడాది క్రాక్ రేంజ్ లో లాక్ డౌన్ తర్వాత బాక్సాఫీస్ కు బూస్ట్ ఇచ్చే సినిమాగా డిస్ట్రిబ్యూటర్లు ఖిలాడీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం

Also Read : DJ Tillu : హైప్ పెంచుకుంటున్న చిన్న సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి