ఇప్పుడంతా ట్రెండీ యుగం. హీరో అల్ట్రా స్టైలిష్ గా ఉంటూ రెండు మూడు సులువైన డైలాగులు చెప్పేసి, ఈజీగా ఫైట్లు చేసేసి, నాలుగు కామెడీ ట్రాక్స్ పండించేసి పని కానిచ్చేస్తున్నాడు. నటన పరంగా పెద్దగా ఛాలెంజ్ గా ఫీలయ్యే సబ్జెక్టులు దర్శకరచయితలు తయారు చేయడం లేదు, అటు రిస్క్ అనిపించేవి హీరోలూ ట్రై చేయడం లేదు. అప్పుడెప్పుడో యాభై ఏళ్ళ క్రితం వచ్చిన దానవీర శూరకర్ణలో ‘ఏమంటివి ఏమంటివి జాతి నెపమున’ అంటూ ఎన్టీఆర్ గుక్కతిప్పుకోకుండా చెప్పే […]
బాలీవుడ్ కమర్షియల్ సినిమాని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన మిస్టర్ ఇండియా సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ అనే చెప్పొచ్చు. మన జగదేకేవీరుడు అతిలోకసుందరికి ఇదే ఇన్స్ పిరేషన్. దర్శకుడు శేఖర్ కపూర్ పేరు ఆ సమయంలోనే మారుమ్రోగిపోయింది. అనిల్ కపూర్, శ్రీదేవిల స్టార్ డంను ఇంకొన్ని మెట్లు పైకెక్కించిన మిస్టర్ ఇండియాని వివిధ భాషల్లో రీమేక్ చేసి మరీ బాగ్యరాజా, అంబరీష్ లాంటి స్టార్ హీరోలు హిట్లు అందుకున్నాడు. ఇక శేఖర్ కపూర్ తీసిన బండిట్ […]
అదేదో సినిమాలో ఎల్బి శ్రీరామ్ రాసిన డైలాగ్ ఒకటుంది. అదృష్టలక్ష్మి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చాడంట ఒకడు. బ్యాడ్ లుక్ వెంటే ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలాంటివి మరీనూ. దానికో చక్కని ఉదాహరణ ఉంది. 1992లో రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమ్రోగిపోతున్న టైంలో అతనితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలని అగ్ర నిర్మాత అశ్వినిదత్ ప్లాన్ చేసుకున్నారు. ఏదైనా మంచి కథ […]
నాకు పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని రోజులు.బ్లాక్ అండ్ వైట్ టీవీలో వీడియో క్యాసెట్ వేసుకుని ఓ బ్లాక్ బస్టర్ సినిమా చూస్తుండగా ఒక డౌట్ వచ్చింది. డాన్స్ అంటే అందరూ చిరంజీవి లాగే చేస్తారనే నమ్మకంలో ఉన్నా అప్పటిదాకా. కానీ స్క్రీన్ మీద జరుగుతోంది వేరు. దాంతో నా పక్కనే ఉన్న అన్నయ్యను అడిగా “అన్నా, వయసైపోయిన ఆ హీరో స్టెప్స్ వేయడానికి చాలా కష్టపడుతున్నాడు కదా. నీకేం నచ్చిందని అంత ఆబగా గుడ్లప్పగించి […]
చాలా మంది నన్ను అడుగుతుంటారు… మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అని..? ఫేవరెట్ హీరో ఎవరన్నప్పుడల్లా ఒక్కో సినిమాలో వాళ్ళ వాళ్ళ నటనని బట్టి ,నా వయసును బట్టి నా పరిస్థితులని బట్టి,నా జీవిత ప్రయాణాన్ని బట్టి ఒక్కో హీరో పేరు చెబుతుండేవాన్ని. ఒకసారి చిరంజీవనీ, ఒకసారి అమితాబచన్ అనీ, ఒకసారి కమలహాసన్ అనీ, ఒకసారి రజనీకాంత్ అనీ, ఒకసారి షారూఖ్ ఖాన్ అనీ, ఒకసారి అజయ్ దేవగన్ అనీ, ఒకసారి నానాపాటేకర్ అనీ.. ఒకసారి […]
తెలుగు సినిమా జర్నలిజంలో అత్యంత అనుభవజ్ఞులుగా పేరున్న పసుపులేటి రామారావు ఇవాళ కన్ను మూశారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి తరం దాకా ఎందరో నటీనటులతో ప్రయాణించిన అనుభవం ఆయనది. విశాలాంధ్ర పత్రికతో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన రామరావు గారు ఆ తర్వాత సంతోషం లాంటి న్యూ జనరేషన్ మ్యాగజైన్స్ కు వరకు ఎన్నో సంస్థలకు సేవలు అందించారు. ఈయన స్వస్థలం ఏలూరు. డిగ్రీ దాకా విద్యాభ్యాసం చేశారు. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలలో కీలక […]
ఇక్కడి ఫోటోలో రజనీకాంత్ ఆప్యాయంగా కౌగిలించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా. తను ఎవరో కాదు తన డాన్స్ అండ్ యాక్టింగ్ తో హిందీ సినిమాల్లో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్సిన హృతిక్ రోషన్. బాల్యంలోనే నటన మొదలుపెట్టిన హృతిక్ కు ఆ వయసులోనే రజినితో నటించే అవకాశం దక్కింది. ఆ ముచ్చటే ఇది. 1986లో రజనీకాంత్ టైటిల్ రోల్ లో భగవాన్ దాదా అనే సినిమా వచ్చింది. హృతిక్ నాన్న రాకేష్ రోషన్ నిర్మాత కాగా […]
1990లో క్షణక్షణం సినీమా షూటింగ్ రోజులవి. అన్నపూర్ణ స్టూడియోలో సంగీత దర్శకుడు కీరవాణి గారి సిట్టింగు జరుగుతోంది. తను ఒక అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లేందుకు కారు కావాలని ఆ సినిమాకి చీఫ్ అసోసియేట్ గా పని చేస్తున శివనాగేశ్వరరావుని అడిగారట. ఆయన ప్రోడక్షన్ కారును, డ్రైవరుని ఏర్పాటు చేసారట. బయటకు వెళ్లిన కీరవాణి 10 నిమిషాల్లో వచ్చేసి మ్యూజిక్ సిట్టింగులోకి వెళ్లిపోయారు. నేరుగా కీరవాణినే అడగగలిగినా శివనాగేశ్వరరావు డ్రైవర్ని పిలిచి “ఎక్కడికి తీసుకెళ్లావు?” అని అడిగారు. […]
https://youtu.be/