తన భర్తకు ప్రాణ హాని ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున చేసిన కామెంట్స్ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తన భర్తను చంపేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో.. మినిస్టర్ కేటీఆర్.. ఈటల భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈటెలకు భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈటల భద్రతపై కేసీఆర్ సర్కార్ […]
తెలంగాణలో రాజకీయ పార్టీలలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. ఈవీఎం పోరుకు పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఈ దిశలో అధికార టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీల కన్నా ముందు ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొట్టాలని గులాబీ దళపతి కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎక్కడా ఛాన్స్ తీసుకోవడం లేదు. విజయవంతమైన వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్(పీకే)ను […]
ప్రజాప్రతినిధి కాలం చేయడం, అనర్హతకు గురవడం, రాజీనామా చేయడం..వంటి అనేక కారణాల వల్ల ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ తరహాలోనే గత ఏడాది అక్టోబర్‌లో తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్లో పుట్టి పెరిగిన ఈటెల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఫలితంగా ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఈటెల రాజేందర్ […]
మాజీ మంత్రి, టీఆర్ఎస్ మాజీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ అధిష్టానంతో ఏర్పడిన బేధాభిప్రాయాల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోయిన ఈటల.. ఆ తర్వాత టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. సంబంధిత […]
తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖను ఈటల రాజేందర్ నుంచి తీసేసుకున్న సీఎం కేసీఆర్.. త్వరలోనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని వార్తలు బయటికి వస్తున్నాయి. ఇందుకు రంగం సిద్ధమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో నేతలకు మొదటి నుంచీ వైద్య ఆరోగ్య శాఖ అచ్చిరాలేదు. ఎందుకంటే ఈ ఎనిమిదేళ్లలో ముగ్గురు మంత్రులు మారారు. […]
తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. జనగాం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్లకు వైరస్ సోకిందని నిర్థారణ అయింది. వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈటెల హోం క్వారంటైన్లోకి వెళ్లారు. లాక్డౌన్ సమయంలో తెలంగాణలో వైరస్ నియంత్రణలోకి వచ్చినట్లు కనిపించగా.. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి […]