iDreamPost

ఆత్మహత్యకు పాల్పడ తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు!

ఆత్మహత్యకు పాల్పడ తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు!

నేటి సమాజంలో ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారంగా భావించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆత్మస్థైర్యం అనేది నేటికాలం మనషుల్లో కొరవడింది. కుటుంబ కలహాలు, పరీక్షల్లో ఫెయిల్, ఆర్థిక ఇబ్బందులు వంటి ఇతర కారణాలతో  చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు సైతం వివిధ కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఆత్మహత్యల ఎక్కువ గా జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎస్సైలు, కానిస్టేబులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా తాడిపత్రి టౌన్ సీఐ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐగా ఆనందరావు విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లారు. అనంతరం ఇంట్లో తలుపులు బింగించుకుని ఉరేసుకుని సీఐ బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు… తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నాయని.. నిన్న రాత్రి కూడా సీఐ ఆనందరావు దంపతులు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ కారణంగా సీఐ ఆనందరావు మనస్తాపం చెందారు.

అనంతరం ఆనందరావు బలవన్మరణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తెలింది” అని ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ఇక సీఐ మృతిపై పలువుపు పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. అలానే తాడిపత్రి టౌన్ సీఐ మృతి పట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఐ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్ లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐ ఆనందరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరి.. పోలీస్ శాఖలో ఇలా ఆత్మహత్యలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి