iDreamPost

T20 వరల్డ్ కప్​కు కీపర్ ఫిక్స్! DK​తో పాటు వాళ్లిద్దరికీ హ్యాండ్ ఇచ్చిన BCCI

  • Published Apr 25, 2024 | 7:45 PMUpdated Apr 25, 2024 | 7:45 PM

టీ20 వరల్డ్ కప్​లో ఆడే టీమిండియా స్క్వాడ్ గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.

టీ20 వరల్డ్ కప్​లో ఆడే టీమిండియా స్క్వాడ్ గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.

  • Published Apr 25, 2024 | 7:45 PMUpdated Apr 25, 2024 | 7:45 PM
T20 వరల్డ్ కప్​కు కీపర్ ఫిక్స్! DK​తో పాటు వాళ్లిద్దరికీ హ్యాండ్ ఇచ్చిన BCCI

భారత క్రికెట్​కు సంబంధించి ఈ మధ్య ఒకటే విషయం బాగా చర్చకు దారితీస్తోంది. అదే టీ20 వరల్డ్ కప్ సెలక్షన్. ఐపీఎల్-2024కు ముందు వరకు ప్రపంచ కప్ టీమ్ గురించి ఓ అవగాహన ఉండేది. వీళ్లు పక్కా జట్టులో ఉంటారని అంతా అనుకునేవారు. కానీ క్యాష్ రిచ్​ లీగ్​లో ఊహకందని రీతిలో ఇతర ఆటగాళ్లు కూడా దుమ్మురేపుతుండటంతో వరల్డ్ కప్ టికెట్ ఎవరికి దక్కుతుందో అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్​గా ఎవర్ని తీసుకుంటారనేది ఆడియెన్స్​కే కాదు.. మాజీ ఆటగాళ్లకు కూడా అర్థం కావడం లేదు. రీఎంట్రీలో రిషబ్ పంత్​తో పాటు సంజూ శాంసన్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ దుమ్మురేపుతుండటంతో ఆ పొజిషన్​కు తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

టీ20 ప్రపంచ కప్​లో పాల్గొనే జట్టును ప్రకటించాల్సిన సమయం దగ్గర పడుతోంది. దీంతో గురువారం బీసీసీఐ అధికారులు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్​తో పాటు ఇతర సెలెక్టర్లు, టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీలో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్ ఉండటంతో అక్కడికి వచ్చిన హిట్​మ్యాన్ హోటల్ నుంచి నేరుగా సెలెక్టర్లతో సమావేశానికి వెళ్లాడని సమాచారం. ఈ మీటింగ్​లో కీలక నిర్ణయాలు తీసుకున్నారట. మెయిన్ వికెట్ కీపర్​గా రిషబ్ పంత్​ను ఆడించాలని అందరూ నిర్ణయించారట. అయితే సెకండ్ వికెట్ కీపర్​గా ఎవర్ని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని వినికిడి. సంజూ శాంసన్, దినేష్ కార్తీక్​, రెగ్యులర్ ప్లేయర్ కేఎల్ రాహుల్​లో ఎవర్ని ఈ రోల్ కోసం తీసుకోవాలో మల్లగుల్లాలు పడ్డారట.

సంజూ, డీకేని కాదని సెకండ్ కీపర్​గా కేఎల్ రాహుల్​ను ఎంపిక చేశారని క్రికెట్ వర్గాల సమాచారం. డీకేకు వయసు మీద పడటం, సంజూ కంటే రాహుల్​ సీనియర్ కావడం, కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తుండటం, వరల్డ్ కప్ స్ట్రీమ్ ఆఫ్​ థింగ్స్​లో ముందు నుంచి ఉండటంతో అతడి వైపే అందరూ మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ సమావేశంలో వికెట్ కీపింగ్​తో పాటు బౌలింగ్ యూనిట్ గురించి కూడా డిస్కషన్ సాగిందట. పేసర్లుగా జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కన్ఫర్మ్ అయ్యారట. స్పిన్​ ఆల్​రౌండర్​గా రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్​గా కుల్దీప్ యాదవ్​ను ఫైనలైజ్ చేశారట సెలెక్టర్లు.

ఇంకో స్పాట్ కోసం రవి బిష్ణోయ్, అవేశ్​ ఖాన్, అక్షర్ పటేల్​లో ఎవర్ని తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారట. ఈ ఒక్క పొజిషన్ ఫిక్స్ అయితే బౌలింగ్ యూనిట్ సెలెక్షన్ కంప్లీట్ అయినట్లేనని సమాచారం. అయితే ఐపీఎల్​లో అదరగొడుతున్న డీకే, సంజూను కాదని రాహుల్​ను తీసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లిద్దరికీ బోర్డు హ్యాండ్ ఇవ్వడం సరికాదని చెబుతున్నారు. కాగా, టీమ్ సెలెక్షన్ గురించి బోర్డు నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మీటింగ్ తర్వాత ఏదైనా అనౌన్స్​మెంట్ చేస్తారేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి