iDreamPost

ఫ్యామిలీ కళ్లముందే.. బీచ్ లో స్విమ్ చేస్తూ పేలిన వ్యక్తి.. ఎగిరిపడిన అవశేషాలు

ఫ్యామిలీ కళ్లముందే.. బీచ్ లో స్విమ్ చేస్తూ పేలిన వ్యక్తి.. ఎగిరిపడిన అవశేషాలు

సరదాగా అలా బీచ్ లో స్విమ్మింగ్ చేస్తున్న వ్యక్తి.. ఫ్యామిలీ అంతా చూస్తుండగానే ఒక్కసారిగా పేలిపోయాడు. అతని శరీర అవశేషాలు కుటుంబసభ్యులు ఉన్న చోటికి ఎగిరిపడటం మరింత విషాదకరం. ఈ దారుణం ఉక్రెయిన్ బీచ్ లో జరిగింది. వ్యక్తి పేలిపోవడంతో.. అక్కడున్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆ వ్యక్తి పేలడానికి కారణం సముద్రపు నీటి అడుగున అమర్చిన మైన్లే. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు నీటి అడుగున మైన్స్ ఏర్పాటు చేశారని, ఆ ప్రాంతంలో స్విమ్మింగ్ ను నిషేధిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.

కానీ.. వాటిని పట్టించుకోకుండా సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లడంతోనే ఈ హఠాత్ పరిణామం జరిగింది. “ఒడెస్సా ప్రాంతంలో నివాసితులు, విజిటర్లు నియమాలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు కోరారు. సముద్రం తీరప్రాంత రక్షణ జోన్‌కు వెళ్లొద్దు. ఈత కొట్టవద్దు” అని పోలీసులు కోరారు. ఒడెస్సా జిల్లాలోని గ్రామంలో సముద్రంలో ఈత కొడుతుండగా, ఓ మైన్ పేలుడు 50 ఏళ్ల వ్యక్తి మృతికి కారణమైంది. అతని భార్య, కొడుకు, స్నేహితుడి కళ్ల ముందే ఈతకు వెళ్లిన క్షణాల్లోనే ఆ వ్యక్తి పేలిపోవడం బాధాకరం. అయితే.. సముద్రంలో రష్యానే మైన్లు వేసిందని ఉక్రెయిన్ ఆరోపించగా.. క్రెమ్లిన్ దళాలు మైన్లను వేసింది కైవ్ అని ఆరోపించాయి.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి