iDreamPost

స్విగ్గీలో కాఫీ ఆర్డర్ చేస్తే.. డంజోలో డెలివరీ చేసి రేటింగ్ అడిగిన ఘనుడు..

స్విగ్గీలో కాఫీ ఆర్డర్ చేస్తే.. డంజోలో డెలివరీ చేసి రేటింగ్ అడిగిన ఘనుడు..

బెంగుళూరులో స్విగ్గిలో కాఫీ ఆర్డర్ చేస్తే Dunzoలో డెలివరీ చేసిన ఓ డెలివరీ బాయ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓంకార్ జోషి అనే ఓ వ్యక్తి ఇటీవల కాఫీ డే నుంచి స్విగ్గీలో కాఫి ఆర్డర్ చేశాడు. అయితే ఆ కాఫి Dunzoలో డెలివరీ అవ్వడంతో ఆశ్చర్యపోయాడు. అంతేకాక స్విగ్గీ డెలివరీ బాయ్ నేను ఆర్డర్ ని Dunzoలో పంపించాను, నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని అడగడంతో అతను మరింత ఆశ్చర్యపోయాడు.

ఈ సంఘటనని బెంగుళూరు గురించి ఆసక్తికర విషయాలని పోస్ట్ చేసే పీక్ బెంగుళూరు అనే ఓ ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేసుకున్నాడు ఆ వినియోగదారుడు. ఈ ట్వీట్ లో.. నేను కాఫీ డే నుంచి స్విగ్గీలో కాఫీ బుక్ చేసుకున్నాను. దాన్ని స్విగ్గీ డెలివరీ బాయ్ తీసుకున్నాడు. కానీ అతనికి బద్ధకం అనుకుంట, అతను ఆ ఆర్డర్ ని Dunzoలో బుక్ చేసి నాకు పంపించాడు. పైగా నాకు కాల్ చేసి ఆర్డర్ Dunzoలో పంపించాను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పాడు అంటూ పోస్ట్ చేశాడు.

దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని చాలా మంది నవ్వుకుంటున్నారు, కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది స్విగ్గీ డెలివరీ బాయ్ స్మార్ట్ వర్క్ అంటూ పొగుడుతున్నారు. ఈ ట్వీట్ ని చాలా మంది షేర్ చేసి, రీ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ చదివి నెటిజన్లు ఫన్నీ రిప్లైలు కూడా ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి