iDreamPost

మంత్రి పదవి కోసం స్వామీజీ బెదిరింపు

మంత్రి పదవి కోసం స్వామీజీ బెదిరింపు

ఆయ‌నో మ‌ఠాదిప‌తి.. ప‌క్క‌న కూర్చున్నది రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. అక్క‌డ జ‌రుగుతున్న‌ది ఓ బ‌హిరంగ స‌భ‌.. ఇలాంటిచోట‌ వీలైతే ప్ర‌జా స‌మస్యల గురించి మాట్లాడుకోవాలి.. పోట్లాడుకోవాలి. అయితే అక్క‌డ జ‌రిగింది పూర్తిగా రివ‌ర్స్‌లో..

క‌ర్నాట‌క‌లో మొన్న జ‌రిగిన ఉందంతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓ బ‌హిరంగ స‌భ‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఓ మ‌ఠాదిప‌తి నిలదీయ‌డం చూస్తే మ‌ఠాదిప‌తులు ఏవిధంగా రాజ‌కీయాల‌ను శాసిస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. క‌ర్నాట‌క‌లోని దావ‌ణ‌గిరి ప్రాంతంలో లింగాయ‌త్ ప‌రంప‌ర‌కు చెందిన కార్య‌క్రమంలో వ‌చ‌నానంద స్వామీజీతో క‌లిసి ముఖ్య‌మంత్రి య‌డ్‌యూర‌ప్ప పాల్గొన్నారు.

అయితే త‌మ ప్రాంతం అభివృద్ధి కోసం సీఎంను నిధులు, ఇత‌ర స‌హాయం అడ‌గాల్సిన ఆ స్వామీజీ ఏకంగా మంత్రి ప‌ద‌వులు అడిగారు. త‌మ లింగాయ‌త్ ప‌రంప‌ర‌కు చెందిన మురుగేష్ నిరాని అనే ఎమ్మెల్యేకు క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి. లేదంటే త‌మ ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తోంద‌ని హెచ్చ‌రించారు. దీంతో ముఖ్య‌మంత్రితో పాటు అక్క‌డున్న వారంతా కంగుతిన్నారు. విష‌యంలోకి వెళితే దేశ రాజ‌కీయాల‌లో క‌ర్నాట‌క రాజ‌కీయం చాలా చ‌ర్చ‌కు దారితీసింది. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించినా కాంగ్రెస్‌, జేడిఎస్ క‌ల‌యిక‌తో ప్ర‌భుత్వ ఏర్పాటులో కొంత ఇబ్బందిని ఎదుర్కొంది. అయితే ఆ త‌ర్వాత 15 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌, జేడిఎస్ కు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో మళ్లీ బీజేపీ స‌ర్కార్ కొలువుదీరింది. వీరితో పాటు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కొలువు దీరింది య‌డ్‌యూర‌ప్ప స‌ర్కార్‌. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఉన్న 105 మంది ఎమ్మెల్యేల‌తో పాటు త‌మ‌ను ఆప‌ద స‌మ‌యంలో ఆదుకున్న ఎమ్మెల్యేల‌కు త‌గిన గౌర‌వం ఇచ్చి ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల్సిన బాధ్య‌త బీజేపీపై ఉంది.

ఇలా పబ్లిక్ మీటింగ్‌లో సీఎంను వ‌చ‌నానంద స్వామీజీ నిల‌దీయ‌డంతో ఇదే విష‌యాన్ని సీఎం య‌డ్యూర‌ప్ప ఘాటుగా చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం త‌గు సూచ‌న‌లు ఇవ్వాల్సిందిపోయి ఇలా మంత్రి ప‌ద‌వులు కావాలని అడ‌గ‌డం మంచిది కాద‌న్నారు. త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అవ‌స‌రం లేద‌ని అవ‌స‌ర‌మైతే రాజీనామా చేసేందుకైనా సిద్ధ‌మ‌న్నారు. అయితే ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రి ప‌ద‌వి విష‌యంలో ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తే బ‌య‌టి పార్టీల నుంచి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలుపుతున్న వారు బీజేపీ స‌ర్కార్‌పై మ‌రే విధంగా ఒత్తిడి తెస్తారోన‌ని క‌ర్నాట‌క‌లో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి