iDreamPost

టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌! మరి హర్దిక్‌ పాండ్యా..?

  • Published Jul 21, 2023 | 3:19 PMUpdated Jul 21, 2023 | 3:19 PM
  • Published Jul 21, 2023 | 3:19 PMUpdated Jul 21, 2023 | 3:19 PM
టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌! మరి హర్దిక్‌ పాండ్యా..?

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌లో అదరగొడుతోంది. తొలి టెస్ట్‌లో కరేబియన్‌ టీమ్‌ను మూడు రోజుల్లోనే ఓడించిన భారత్‌, రెండో టెస్ట్‌లోనూ తొలి రోజు పట్టుబిగించింది. ఒక వైపు సీనియర్‌ టీమ్‌ విజయపథంలో దూసుకుపోతుంటే.. మరోవైపు చిన్న దేశాలతో సిరీస్‌లకు మరో టీమ్‌ను బీసీసీఐ సెలెక్టర్లు రెడీ చేస్తున్నారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ తర్వాత భారత్‌ ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

అయితే ఐర్లాండ్‌తో ఆడే టీ20 జట్టుకు టీమిండియా మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించనున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఇప్పటికే టీమ్‌ను ప్రకటించారు. ఈ జట్టుకు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత టీ20లకు హార్దిక్‌ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్‌ను పూర్తిగా టీ20లకు దూరంగా ఉంచుతున్నారు.

అలాగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టీ20 టీమ్‌కు ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు ఫిక్స్‌ అయ్యారు. పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చి, యువ టీమిండియాను సూర్య భాయ్‌ నడిపించనున్నాడు. మరి సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి