iDreamPost

Surya And Karthi: మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. మంచి మనసు చాటుకున్న సూర్య, కార్తీ!

మిచౌంగ్‌ తుఫాను ప్రభావం కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా చెన్నైలోని పలు ఏరియాలు నీటితో నిండిపోయాయి. చెరువులను తలిపిస్తున్నాయి..

మిచౌంగ్‌ తుఫాను ప్రభావం కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా చెన్నైలోని పలు ఏరియాలు నీటితో నిండిపోయాయి. చెరువులను తలిపిస్తున్నాయి..

Surya And Karthi: మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. మంచి మనసు చాటుకున్న సూర్య, కార్తీ!

ప్రస్తుతం మిచౌంగ్ తుఫాను ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు, సుడిగాలులు సైతం వీస్తున్నాయి. పెద్ద మొత్తం ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఇక, తమిళనాడులోనూ మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులన్నీ అడుగుల ఎత్తు నీటితో నిండిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో..

పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఆపత్కాలంలో ఎప్పటిలాగే వరద బాధితులను ఆదుకోవటానికి కోలీవుడ్‌ హీరోలు రంగంలోకి దిగారు.  తుఫాన్ కారణంగా చెన్నైలోని టి.నగర్ టన్నెల్, రంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్, అన్నానగర్,

కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో అక్కడ నివసించే ప్రజలు కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆహారం విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కోలివుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ సహయం చేసేందుకు ముందుకు వచ్చారు. తక్షణ సాయం కింద రూ.10 లక్షలు ఆర్థిక సహయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యవసర వస్తువులు, చిన్న పిల్లలకు పాలు, మెడిసిన్స్ అందిస్తున్నారు.

‘అంతేకాకుండా పరిస్థితులు చక్కబడితే మరింత సాయం చేసేందుకు తాము వెనుకాడమని కార్తీ తెలిపాడు. ఇక, హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు. మరోవైపు.. ప్రభుత్వం కూడా పలుచోట్ల తాత్కలిక శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను అదుకుంటోంది. ఇక, గతంలోనూ చాలా సార్లు చెన్నైలో వరదలు వచ్చాయి. అప్పుడు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వారే రంగంలోకి దిగి సాయం చేశారు. విశాల్‌ వరద బాధితులకు సాయం చేయడానికి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లారు. నేరుగానే బాధితులకు సాయం చేశారు. ఇప్పుడు కూడా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లనున్నారు. సూర్య, కార్తీలు ఎప్పటిలాగే ఆర్థిక సాయం చేశారు. మరి, సూర్య, కార్తీ వరద బాధితులకు ఆర్థిక సాయం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి