iDreamPost

Suriya, Kanguva: కంగువ చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అంటున్న సూర్య!

  • Published Mar 24, 2024 | 1:38 PMUpdated Mar 24, 2024 | 1:38 PM

ప్రముఖ కోలివుడ్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ. ఈ సినిమాను శివ తెరకెక్కిస్తుండగా జ్ఞాన వేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ముంబైలో ఓ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ కోలివుడ్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ. ఈ సినిమాను శివ తెరకెక్కిస్తుండగా జ్ఞాన వేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ముంబైలో ఓ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Mar 24, 2024 | 1:38 PMUpdated Mar 24, 2024 | 1:38 PM
Suriya, Kanguva: కంగువ చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అంటున్న సూర్య!

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఒకటి “కంగువ”. తమిళ సినిమా నుండి రాబోతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇలాంటి అద్భుతమైన సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని స్టార్ హీరో సూర్య అన్నారు. ఆయన ప్రథాన పాత్రలో డిఫరెంట్ గేటప్స్ లో కనిపించనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. కంగువతో దర్శకుడు సిరుతై శివ మొదటిసారిగా హిస్టారికల్ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

దిషా పటానీ, బాబీ డియోల్ కంగువలో ఇతర ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని కె.ఇ. జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పది భాషల్లో విడుదల కానున్న కంగువ 3D వెర్షన్లో కూడా విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ సినిమా అఫిషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

అయితే తాజాగా ముంబైలో ‘కంగువ’ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు కంగువ చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ – “గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ లోకం నమ్మి మనం అనుకున్నది జరిగేలా చేస్తుందని నేను నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ ఈ సినిమా మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కూడా కృతజ్ఞతలు.

అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు అలా జరగకుండా ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలో నటించడం నాకు ఎప్పుడూ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి