iDreamPost

ఆ విషయంలో ప్రభాస్​ ‘కల్కీ 2898 ఏడీ’ని దాటేసిన సూర్య ‘కంగువా’ మూవీ!

  • Author singhj Published - 05:44 PM, Thu - 27 July 23
  • Author singhj Published - 05:44 PM, Thu - 27 July 23
ఆ విషయంలో ప్రభాస్​ ‘కల్కీ 2898 ఏడీ’ని దాటేసిన సూర్య ‘కంగువా’ మూవీ!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జోరు పెంచుతున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన వరుసగా మూవీస్ చేసుకుంటూ పోతున్నారు. డార్లింగ్ నటించిన గత చిత్రం ‘ఆదిపురుష్’ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్​గా మారింది. అయితే ప్రభాస్ ఇమేజ్ వల్లే ఆ సినిమా మంచి వసూళ్లు సాధించి బయటపడింది. ఆ ఫిల్మ్​కు వచ్చిన నెగెటివిటీకి ఆ రేంజ్​లో కలెక్షన్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. దీంతో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెంచారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కీ 2898 ఏడీ’తో పాటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రాలతో ఆయన బిజీబిజీగా ఉన్నారు.

‘సలార్’ చిత్రం టీజర్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకుంది. రీసెంట్​గా వచ్చిన ‘కల్కీ 2898 ఏడీ’ గ్లింప్స్ కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంది. హాలీవుడ్ రేంజ్​లో ఉన్న షాట్స్, విజువల్ ఎఫెక్ట్స్​ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రభాస్ నుంచి ఆయన అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉండనున్నాయని గ్లింప్స్ వీడియో చూస్తే తెలుస్తోంది. దీపికా హీరోయిన్​గా హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ గ్లింప్స్​ వీడియోకు భారీగానే రెస్సాన్స్ వచ్చినా వ్యూస్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఇప్పుడు ‘కల్కీ 2898 ఏడీ’ని కోలీవుడ్ స్టార్ సూర్య సినిమా బీట్ చేసేసింది.

తమిళ స్టార్ హీరో సూర్యకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సూర్య నుంచి నటిస్తున్న ‘కంగువా’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్​ వీడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. వ్యూస్ విషయంలో ప్రభాస్​ ‘కల్కీ’ని సూర్య ‘కంగువా’ త్వరగానే అధిగమించింది. ‘కల్కీ’ గ్లింప్స్​కు 22 మిలియన్ల వ్యూస్​ రాగా.. ‘కంగువా’ గ్లింప్స్​ వీడియోకు ఏకంగా 30 మిలియన్ వ్యూస్​తో రికార్డు సృష్టించింది. అలాగే సూర్య ‘కంగువా’ మూవీ 10 భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి