iDreamPost

వీడియో: ఈ వయసులో కూడా అదే ఫీల్డింగ్! రైనా మెరుపు రనౌట్!

  • Published Aug 21, 2023 | 1:11 PMUpdated Aug 21, 2023 | 1:11 PM
  • Published Aug 21, 2023 | 1:11 PMUpdated Aug 21, 2023 | 1:11 PM
వీడియో: ఈ వయసులో కూడా అదే ఫీల్డింగ్! రైనా మెరుపు రనౌట్!

టీమిండియాలో ఫీల్డింగ్‌ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. కొంతమంది ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ వరుసలో మొహమ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌ సింగ్‌.. ఆ తర్వాత సురేష్‌ రైనానే. రైనా తర్వాత విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా బెస్ట్‌ ఫీల్డర్లుగా పేరుతెచ్చుకున్నా.. ఫీల్డింగ్‌లో రైనాకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. రైనా నుంచి దాటుకుని బంతి వెళ్లడం దాదాపు అసాధ్యమనే భావన ప్రపంచంలోని ప్రతి బ్యాటర్‌ మైండ్‌లో అలా ఫిక్స్‌ అయిపోయింది. అందుకే రైనా వైపు బాల్‌ వెళ్లితే.. చాలా మంది బ్యాటర్లు క్రీజ్‌ నుంచి కాలు బయటపెట్టేవారు కాదు. రైనా ఫీల్డింగ్‌ అంటే అప్పట్లో అంత భయం ఉండేది. టీమిండియా నంబర్‌ వన్‌ టీమ్‌ అవ్వడానికి రైనా లాంటి ఫీల్డర్ల పాత్ర కూడా ఎంతో ఉంది.

అయితే.. తన ఆప్తమిత్రుడు, క్రికెట్‌ పార్ట్నర్‌ మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజే.. రైనా కూడా తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని ఐపీఎల్‌లో మెరిసిన రైనా.. ఐపీఎల్‌ 2022 నుంచి ఎల్లో జెర్సీలో కనిపించడం మానేశాడు. దీంతో రైనా బ్యాటింగ్‌ మెరుపులతో పాటు, ఫీల్డింగ్‌ విన్యాసాలను కూడా క్రికెట్‌ అభిమానులు మిస్‌ అవుతున్నారు. అయితే.. ఐపీఎల్‌లో రైనా ఆడకపోయినా.. అమెరికా వేదికగా జరుగుతున్న యూఎస్‌ మాస్టర్స్‌ టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు.

ఈ లీగ్‌లో భాగంగా శనివారం టెక్సాస్‌ ఛార్జర్స్‌- కాలిఫోర్నియా నైట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సురేష్‌ రైనా తన ఫీల్డింగ్‌ విన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించాడు. అవి ఎలా ఉన్నాయంటే.. రైనా వయసు పెరుగుతున్నా.. అతని రక్తంలో వేడి మాత్రం తగ్గడం లేదు అనేలా ఉన్నాయి. టీమిండియాకు ఆడుతున్నప్పుడు ఎలాంటి అద్భుతం ఫీల్డిండ్‌ చేసే వాడో.. ఇప్పుడు 36 ఏళ్ల వయసులోనూ అలాంటి ఫీల్డింగ్‌తోనే ఆకట్టుకున్నాడు.

కాలిఫోర్నియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనాకు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కానీ, ఫీల్డింగ్‌తో రైనా సూపర్‌ అనిపించాడు. ఓ క్యాచ్‌ అందుకోవడంతో పాటు.. టెక్సాస్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌ను డైరెక్ట్‌ త్రోతో పెవిలియన్‌ చేర్చాడు. రైనా కొట్టిన ఆ డైరెక్ట్‌ త్రో వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైనాలో ఇంకా ఆ ఫీల్డింగ్‌ సత్తా ఏ మాత్రం తగ్గలేదంటూ క్రికెట్‌ అభిమానులు ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. కిందున్న వీడియో చూసి మీరూ రైనా ఫీల్డింగ్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 కెప్టెన్‌గా బుమ్రా భేష్‌! పాండ్యా.. చూసి నేర్చుకోవాలి అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి