iDreamPost

నిమ్మగడ్డతో పాటు ప్రతివాదులందరికి సుప్రీం కోర్టు నోటీసులు

నిమ్మగడ్డతో పాటు ప్రతివాదులందరికి సుప్రీం కోర్టు నోటీసులు

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సహా ప్రతివాదులందరికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పిటిషన్ దారుల పేర్కొన్న అంశాలకు సమాధానం ఇవ్వాలని అత్యున్నత ‌న్యాయస్థానం ఆదేశించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, అట్లూరి రామకృష్ణ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే, జస్టిస్ పిఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సహా ప్రతివాదులందరికి నోటీసులు జాతీ చేసింది. పిటిషన్లలో పేర్కొన్న అంశాలకు సమాధామ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఇదే అంశంలో ఇప్పటికే కొన్న పిటిషన్లు విచారిస్తున్నామని, వాటితో పాటు ఈ పిటిషన్లు కూడా విచారిస్తామని పేర్కొంది. అన్ని పిటిషన్లు కలిపి‌ విచారించేందుకు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం తరువాత వారంలో తదుపరి విచారణ జరిగే అవకాశాలున్నాయి.

అయితే ఇప్పటికే ఇదే కేసులో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. జూన్ 10న జరిపిన విచారణలో కూడా సుప్రీం కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్లలో పేర్కొన్న అంశాలపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి