iDreamPost

రజనీకాంత్ కి కరోనా పాజిటివ్..? హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక..!

రజనీకాంత్ కి కరోనా పాజిటివ్..? హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక..!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్నాత్తే మువీ షూటింగ్ నిమ్మిత్తం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన హైబీపీ సహా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో వెంటనే సన్నిహితులు కొందరు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో ఉన్న అపోలో ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన వారం క్రితం హైదరాబాద్ కి వచ్చారు. అయితే షూటింగ్ కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడడంతో ఆయన సెట్స్ కి వెళ్లడం లేదు. అదే సమయంలో చిత్ర యూనిట్ లో పలువురు కరోనా బారిన పడడంతో కలకలం రేపింది. ఏడుగురు సహాయకులు కరోనా సోకడంతో షూటింగ్ ముందుకు ఆసగడం లేదు. షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆయన కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఆయన సమీప వ్యక్తులు కరోనా బారిన పడడంతో రజనీకాంత్‌ కూడా మూడు రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నారు. అదే సమయంలో ఇప్పటికే పలుమార్లు పరీక్షలు కూడా నిర్వహించినా ఆయనకు నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ తాజాగా అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో మాత్రం ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ ఐనట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఆయన్ని ఐసోలేషన్ లో ఉంచినట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఐతే ఇది జరిగిన కొద్దిసేపటికి రజనికి కరోనా సోకలేదని అపోలో ఆస్పత్రి తెలిపింది. మీడియా లో ప్రచారం జరుగుతుండడంతో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బీపీ సమస్య తీవ్రంగా ఉందని, అది నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి