iDreamPost

అమెరికాలో ప్రభాస్‌ క్రేజ్‌ మామూలుగా లేదు.. ఎంట్రీకి హాలు దద్దరిల్లింది!

అమెరికాలో ప్రభాస్‌ క్రేజ్‌ మామూలుగా లేదు.. ఎంట్రీకి హాలు దద్దరిల్లింది!

 ‘‍ప్రాజెక్ట్‌ కే’ చిత్ర బృందం విడుదలకు కొన్ని నెలల ముందునుంచే సినిమా ప్రమోషన్లను  మొదలెట్టేసింది. గురువారం అమెరికాలో ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్‌, ప్రభాస్‌, రానా, నాగ్‌ అశ్విన్‌, అశ్వినీ దత్‌ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో జరుగుతున్న ఓ తెలుగు సినిమా ఈవెంట్‌కు జనం పెద్ద సంఖ్యలో రావటం విశేషం. 6500 మంది పట్టే ఆ హాలు జనంతో నిండిపోయింది. వారిలో ఎక్కువ మంది తెల్లవారే ఉండటం చూస్తే తెలుగు సినిమా క్రేజ్‌ ఏ స్థాయికి పెరిగిందో అర్థం అవుతోంది.

అంతేకాదు! ఈవెంట్‌ సందర్భంగా ప్రభాస్‌ ఎంట్రీతో హాలు దద్దరిల్లింది. రానా ప్రభాస్‌ను స్టేజిమీదకు పిలవగానే అక్కడి జనం కేకలు వేయటం మొదలుపెట్టారు. ప్రభాస్‌ స్టేజి దగ్గరకు వచ్చినా.. కొన్ని నిమిషాల పాటు ఆ అరుపులు ఆగలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అమెరికాలో తమ హీరో క్రేజ్‌కు తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియోలను ఫ్రెండ్స్‌కు షేర్‌ చేస్తూ సంతోషపడుతున్నారు.

ఇక, ఈ ఈవెంట్‌ సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌ గింప్స్‌లో ‘ప్రాజెక్ట్‌ కే’ అంటే ఏంటో రివీల్‌ చేసింది. ప్రాజెక్ట్‌ కే అంటే ‘కల్కీ 2898 ఏడీ’. ప్రస్తుతం ఈ కల్కీ గ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గ్లింప్స్‌ అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. యూట్యూబ్‌లో ఏడు గంటల క్రితం విడుదలైన ఈ వీడియోకు 1.6 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. కాగా, కల్కీ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న కల్కీ వచ్చే ఏడాది రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. మరి, అమెరికాలో ప్రభాస్‌ క్రేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి