iDreamPost

SA20 2024: సన్ రైజర్స్ సంచలనం.. వరుసగా రెండోసారి!

సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది కావ్య మారన్ జట్టు.. టైటిల్ పోరులో సైతం అదే ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తుచేసింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది కావ్య మారన్ జట్టు.. టైటిల్ పోరులో సైతం అదే ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తుచేసింది.

SA20 2024: సన్ రైజర్స్ సంచలనం.. వరుసగా రెండోసారి!

సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ఛాంపియన్స్ గా నిలిచింది సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ ను ఎగరేసుకుపోయింది కావ్య మారన్ జట్టు. కేప్ టౌన్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్ టీమ్ ను 89 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఇక ఇదే ఊపును త్వరలో జరగబోయే ఐపీఎల్ 2024 సీజన్ లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 టోర్నీ ముగిసింది. ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్ టీమ్ ను ఓడించి.. రెండోసారి టైటిల్ ను ముద్దాడింది సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్. లీగ్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది కావ్య మారన్ జట్టు. టైటిల్ పోరులో సైతం అదే ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో స్టబ్స్(56*), అబెల్(55), హెర్మెన్(42) కెప్టెన్ మార్క్రమ్(42) పరుగులతో రాణించారు. డర్బన్ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. డర్బన్ కెప్టెన్ కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ టీమ్ సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. సన్ రైజర్ బౌలర్ మార్కో జాన్సన్ 5 వికెట్లతో చెలరేగడంతో.. డర్బన్ టీమ్ కు ఓటమితప్పలేదు. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో ముల్డన్ ఒక్కడే 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక కీలక మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగిన అబెల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సన్ రైజర్స్ ట్రోఫీ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించిన హెన్రిచ్ క్లాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఎస్ఏ20 లీగ్ ను సాధించి రికార్డు సృష్టించింది సన్ రైజర్స్ టీమ్. ఇక ఇదే జోరును వచ్చే ఐపీఎల్ లో కూడా చూపించాలని భావిస్తోంది. మరి సన్ రైజర్స్ ఛాంపియన్స్ గా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Jasprit Bumrah: బుమ్రా మీద ఆ ముద్ర వేయొద్దు.. టీమిండియా మాజీ కోచ్ రిక్వెస్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి