iDreamPost

రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్! ఆయనకు ఏమైంది?

  • Author singhj Published - 03:11 PM, Tue - 25 July 23
  • Author singhj Published - 03:11 PM, Tue - 25 July 23
రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్! ఆయనకు ఏమైంది?

ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా కమెడియన్లకు మంచి పాపులారిటీ ఉంటుంది. కొందరు హాస్య నటులకైతే స్టార్ హీరో, హీరోయిన్ల రేంజ్​లో క్రేజ్ ఉంటుంది. టిక్కెట్ కొని థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయితే వాళ్లకు తిరుగుండదు. అందుకే మంచి కమెడియన్స్​ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. తెలుగులో ఎంతో మంది కమెడియన్లను చూశాం. ఒక టైమ్​లో బ్రహ్మానందం లాంటి కమెడియన్లకు స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు కూడా మీమ్స్​ ద్వారా ఆయన పాపులారిటీ చెక్కు చెదరలేదు. తమిళంలో యోగి బాబు ఇప్పుడు ఫుల్​ స్వింగ్​లో ఉన్నారు. ఈ కమెడియన్ ఉంటే తమ సినిమా సక్సెస్ గ్యారెంటీ అని అక్కడి మేకర్స్ నమ్ముతున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్​లో కమెడియన్లకు కొదువ లేదు. కానీ బాలీవుడ్​లో మాత్రం నవ్వించే నటుల సంఖ్య తగ్గిపోయింది. అక్కడ చెప్పుకోదగ్గ కొందరు కమెడియన్లలో సునీల్ గ్రోవర్ ఒకరు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షో ద్వారా టెలివిజన్‌ ప్రేక్షకులను ఆయన పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ఈ షోతో వచ్చిన క్రేజ్​తో పలు సినిమా ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన ‘గబ్బర్’ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించే ఛాన్స్ దక్కించుకున్నారు సునీల్ గ్రోవర్. ఆ మూవీలో మంచి నటనతో ఆడియెన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకున్నారాయన.

‘యునైటెడ్ కచ్చే’ వెబ్​ సిరీస్​తో ఇటీవల ఆడియెన్స్​ను పలకరించిన సునీల్ గ్రోవర్.. కింగ్ ఖాన్ షారుక్​ మూవీ ‘జవాన్​’నూ నటించారు. దీని గురించి పక్కనబెడితే.. తాజాగా రోడ్డు పక్కన గొడుగులు, మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఆయన కనిపించారు. అలాగే ఒక స్టాల్​లో చపాతీలు చేస్తూ దర్శనమిచ్చారు ఈ ఫొటోలు, వీడియోలను గ్రోవర్ స్వయంగా నెట్టింట అందరితో పంచుకున్నారు. డిఫరెంట్ గెటప్స్​తో కావాల్సినంత వినోదాన్ని పంచే ఆయన.. అసలు ఎందుకిలా చేశారో, దీనికి కారణం ఏంటో తెలియదు. అయితే గ్రోవర్ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్స్ ఇది ప్రమోషన్స్ కోసమే చేసిందని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి