iDreamPost

సుకుమార్ మంచి మనసు! దాసరిని గుర్తు చేస్తున్నాడు!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతింటిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు లైఫ్ ఇచ్చిన ఈ టాప్ నిర్మాత.. తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను హీరోగా నిలబెట్టే బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో అతడితో సెల్ఫిష్ అనే చిత్రం నిర్మిస్తున్నాడు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతింటిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు లైఫ్ ఇచ్చిన ఈ టాప్ నిర్మాత.. తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను హీరోగా నిలబెట్టే బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో అతడితో సెల్ఫిష్ అనే చిత్రం నిర్మిస్తున్నాడు.

సుకుమార్ మంచి మనసు! దాసరిని గుర్తు చేస్తున్నాడు!

సాదాసీదా నటులను టాప్ హీరోలుగా మార్చిన ఘనత నిర్మాత దిల్ రాజుకు దక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మంచి సినిమాలు నిర్మించి.. టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. చాలా మంది హీరోలకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు తన కుమారుడ్ని హీరోగా గుర్తింపు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేంటి అతడికి చాలా చిన్న కుమారుడు కదా అనుకుంటున్నారేమో. చెప్పబోయేది ఆయన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ గురించి. గత ఏడాది రౌడీ బాయ్స్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. సినిమాను సూపర్, బంపర్ అనలేము కానీ. ఒకే వన్ టైం వాచబుల్ మూవీగా పేరు వచ్చింది. ఆశిష్‌లో మంచి నటుడు ఉన్నాడు. సాన పడితే.. కచ్చితంగా మంచి హీరోగా రాణిస్తాడు.

ఇప్పుడు సెల్ఫిష్ అనే మూవీతో రాబోతున్నాడు. దీన్ని కూడా దిల్ రాజునే నిర్మిస్తున్నారు. కాశీ అనే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ కాశీ ఎవరో కాదూ.. లెక్కల మాస్టారు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు. అయితే ఈ మూవీ పట్టాలెక్కి.. షూటింగ్ జరుగుతోంది. అంతలో ఈ చిత్రం తాత్కాలికంగా నిలిపివేశారన్న వార్త వినిపిస్తోంది. కారణం.. అనుకున్న విధంగా సినిమా రాకపోవడమేనని తెలుస్తోంది. స్క్రిప్టు చెప్పిన దానికి, తెరపైకి ఎక్కించడానికి ఎక్కడో కాశీ తడబడ్డాడని, టేకింగ్ స్టైల్ మారిందని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని దిల్ రాజు హామినిచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు తీసిన రష్ చూస్తే ఎక్కడో ట్రాక్ తప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగనున్నాడు పుష్ప డైరెక్టర్ సుకుమార్.

సుక్కు తన శిష్యులను డైరెక్టర్స్‌గా ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. ఆయన నుండి ఓనమాలు దిద్దుకుని మంచి స్క్రిప్టుతో సినిమాలు తీస్తున్నారు. కుమారి 21 ఎఫ్ దర్శకుడు సూర్యప్రతాప్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా.. ఆయన శిష్యులే. స్టూడెంట్స్ సినిమాలు తీస్తే.. మార్పులు, చేర్పులు చేస్తుంటారు ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు సుకుమార్. విరూపాక్షకు కాస్త కథ అటు ఇటు మార్చినట్లు కార్తీక్ చెప్పిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్ కాశీని కూడా మంచి దర్శకుడిగా నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకున్నాడట సుక్కు. పుష్ప సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ రష్ చూడబోతున్నారట. దాని తర్వాత కథ, కథనంలో మార్పులు చేసే అవకాశాలున్నాయి.

ఆ తర్వాత మళ్లీ ఈ మూవీ పట్టాలు ఎక్కనుంది. అయితే ఇప్పుడు సుకుమార్.. తన శిష్యుల పట్ల తీసుకున్న శ్రద్ధ చూస్తుంటే.. ఒకప్పటి దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణను గుర్తు చేస్తున్నారు. దాసరి దగ్గర ఎంతో మంది దర్శకత్వంలో శిక్షణ పొంది.. ఆ తర్వాత డైరెక్టర్లుగా రాణించారు. ఆయన కూడా తన శిష్యుల సినిమాల విషయంలో చొరవ తీసుకుని, తప్పొప్పులు సరి చేసేవారు. కోడి రామకృష్ణ నుండి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఆయన శిష్యులే. మరీ సుక్కు కూడా తన స్టూడెంట్స్ కోసం సమయాన్ని కేటాయించి..వారిని ఫ్యూచర్ డైరెక్టర్లుగా మార్చే పనిలో పడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి