iDreamPost

Success Story: యాక్టర్‌ నుంచి పోలీస్ ఆఫీసర్..! సెల్యూట్ చేయాలనిపించే సక్సెస్ ఇది!

  • Published Feb 06, 2024 | 8:23 PMUpdated Feb 06, 2024 | 8:23 PM

సాధారణంగా ఎవరైనా ఒక్కసారి సినీ రంగుల ప్రపంచానికి వచ్చిన తరువాత.. సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా ఈ రంగుల ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేరు. కానీ, ఒక యువతి మాత్రం ఈ రంగుల ప్రపంచాన్ని వదిలి ఏకంగా ఐపీఎస్ అధికారి అయింది. ఆమె గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ఎవరైనా ఒక్కసారి సినీ రంగుల ప్రపంచానికి వచ్చిన తరువాత.. సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా ఈ రంగుల ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేరు. కానీ, ఒక యువతి మాత్రం ఈ రంగుల ప్రపంచాన్ని వదిలి ఏకంగా ఐపీఎస్ అధికారి అయింది. ఆమె గురించి తెలుసుకుందాం.

  • Published Feb 06, 2024 | 8:23 PMUpdated Feb 06, 2024 | 8:23 PM
Success Story: యాక్టర్‌ నుంచి పోలీస్ ఆఫీసర్..! సెల్యూట్ చేయాలనిపించే సక్సెస్ ఇది!

మన సంకల్పం గట్టిగా ఉంటే ఆలస్యం అయినా సరే.. మన లక్ష్యం వైపుగా మన అడుగులు పడుతూ ఉంటాయి. ఎంతో మంది ఎదో సాధిద్దాం అనే తపనతోనే జీవిస్తూ ఉంటారు. కానీ, అనుకున్నది సాధించాలంటే మాత్రం ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా మన చుట్టూ గొప్ప లక్ష్యాలను ఛేదించే దిశగా వారి అడుగులు వేస్తూ ఉంటారు. అందులోను ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనుకునే వారు ఎంతో మంది ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మంది విజయగాధాలను కూడా మనం తెలుసుకుని ఉంటాం. అలాగే డాక్టర్స్, లెక్చరర్స్ ఇలా మంచి పోసిషన్ లో ఉన్న వారు యాక్టర్స్ అవ్వడం కూడా చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే నిజ జీవితంలోని ఓ వ్యక్తి మాత్రం యాక్టర్ అయిన తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. రంగుల ప్రపంచాన్ని వదిలి ఒక ఐపీఎస్ అధికారిగా మారింది ఓ ప్రముఖ బాలీవుడ్ నటి. ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.

ఆమె మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి సిమ్లాప్రసాద్‌ . ఆమె ఐఏఎస్‌ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కూతురు. అయితే, ఎంతో మంది సినిమా రంగంలో అడుగు పెట్టిన తర్వాత.. అదే రంగంలో స్థిరపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ, వారందరికీ భిన్నంగా సిమ్లా ప్రసాద్ తన లక్ష్యం వైపుగా అడుగులు వేసింది. ఈమె భోపాల్‌లోని.. సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకుని.. కామర్స్‌ సబ్జెక్టులో డిగ్రీ తీసుకుంది. కాగా .. అప్పటికే ఆమె తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గంవైపు ఆమె అడుగులు అటుగా సాగలేదు. సినీ రంగం వైపు నడిచిన ఆమె “అలిఫ్”, “నక్కష్” వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు చేసింది. పైగా “అలీఫ్” సినిమాలో షమ్మీ పాత్ర పోషించినందుకు ఆమె ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె ఓ వైపు సినిమాలు చేస్తూనే.. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది.

అయితే తన మాస్టర్ డిగ్రీ తర్వాత .. ఆమె మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీ పీఎస్‌సీ) పరీక్షలలో.. తన నైపుణ్యాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుందట. అది ఆమెకు కష్టంగా అనిపించినప్పటికీ .. ఇష్టంగా భావించి రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలో సిమ్లా ప్రసాద్ డీఎస్పీగా ఎంపికైంది. మరో విశేషం ఏమిటంటే ఆమె ఎటువంటి కోచింగ్ ఇంస్టిట్యూట్ కు వెళ్లకుండా ఈ యూపీఎస్సీ పరీక్షలను అట్టెంప్ట్ చేసింది. అంతేకాకుండా తొలి ప్రయత్నంలోనే ఈ విజయాన్ని సాధించింది. ఇక ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్‌)లో.. ఎంపికైన సిమ్లా ప్రసాద్ .. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఎస్పీగా తన విధులు నిర్వహిస్తోంది. మరి, యాక్టర్ నుంచి ఒక ఐపీఎస్ అధికారిగా మారిన ఈ యువతి సక్సెస్ స్టోరీపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి