iDreamPost

Sankranthi Clashes : పోటా పోటీ యుద్ధంలో నలిగేది సినిమాలే

Sankranthi Clashes : పోటా పోటీ యుద్ధంలో నలిగేది సినిమాలే

ఒకప్పుడు సంక్రాంతి పండగకు మాత్రమే భారీ సినిమాల క్లాషులు ఉండేవి. అప్పుడు కనీసం ఒకటి లేదా రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చేలా చూసుకుని ఓపెనింగ్స్ విషయంలో జాగ్రత్త పడేవారు. కానీ ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల డిసెంబర్ నుంచి ప్రతి వారం ఇలాంటి యుద్ధం తప్పేలా లేదు. ఇది ఒకటి రెండు నెలలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు. 2022 వేసవి దాకా దీనికి సిద్ధపడి ఉండాలని నిర్మాతలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఎంత సర్దుబాటు చేయాలనుకున్నా అది జరిగే పనిలా కనిపించడం లేదు. దీంతో కంటెంట్ ని నమ్ముకుని బరిలో దిగడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోతోంది. వసూళ్లను పంచుకోక తప్పదు.

ముందుగా డిసెంబర్ 2 సంగతి చూస్తే బాలకృష్ణ అఖండ, మోహన్ లాల్ మరక్కర్ ఒకేరోజు తలపడుతున్నాయి. రెండోది మలయాళం డబ్బింగ్ కాబట్టి మనకు ఇబ్బందేమీ లేదనుకున్నా అందులో ఉన్న క్యాస్టింగ్, గ్రాండియర్ చూస్తే ఏ సెంటర్స్ లో పోటీ తప్పేలా లేదు. డిసెంబర్ 10 గుడ్ లక్ సఖితో పాటు అర్జున ఫల్గుణ వచ్చే ఛాన్స్ ఉంది. రెండు మీడియం బడ్జెట్ సినిమాలే. 17న సోలోగా ప్లాన్ చేసుకున్న పుష్ప పార్ట్ 1కు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ నుంచి ముప్పు ఉంది. ఇక 24న శ్యామ్ సింగ రాయ్, గనిలు ఒకే రోజు తలపడుతున్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసార రావొచ్చని అన్నారు కానీ నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు

జనవరి 7న ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఎవరూ వచ్చే సహాయం చేయడం లేదు కానీ చాలా తక్కువ గ్యాప్ లో 12న భీమ్లా నాయక్, 14న రాధే శ్యామ్ లు రావడం మాత్రం పెద్ద టెన్షన్ రేపుతోంది. 15న బంగార్రాజు వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. 26న పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తున్న ఇద్దరు డెబ్యూ హీరోల సినిమాలు రౌడీ బాయ్స్, హీరో క్లాష్ కావొచ్చు. మొత్తానికి ఇలా క్యాలెండర్ ఏప్రిల్ దాకా వెళ్లేలా ఉంది. నిర్మాతలకు ఇవి టెన్షన్ కలిగించే పరిణామాలే. ప్రేక్షకులకు ఛాయస్ పెరిగినప్పుడు అన్ని సినిమాలు చూడరు. టాక్ ని బట్టి సెలెక్టివ్ గా ప్లాన్ చేసుకుంటారు. ఇది కలెక్షన్ల మీద ప్రభావం చూపించే అంశం. ఇంకో ఏడాది దాకా ఇది తప్పేలా లేదు

Also Read : Akhanda : అంచనాల బరువులో బాలయ్య సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి