Akhanda : అంచనాల బరువులో బాలయ్య సినిమా

By iDream Post Nov. 21, 2021, 04:30 pm IST
Akhanda : అంచనాల బరువులో బాలయ్య సినిమా

ఇంకో పది రోజుల్లో అసలైన మాస్ సినిమా బాక్సాఫీస్ వద్దకు రాబోతోంది. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక నాలుగు నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటిదాకా సరైన కిక్కిచ్చే మూవీ ఒక్కటీ రాలేదు. ఎస్ఆర్ కల్యాణమండపం, లవ్ స్టోరీ, రాజరాజచోర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు విజయాలు సాధించి లాభాలు ఇచ్చాయి కానీ ఇవేవీ మాస్ కి కనెక్ట్ అయినవి కావు. అందుకే ఇప్పుడు అందరి చూపు అఖండ మీదే ఉంది. డిసెంబర్ 2న భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. గత రెండు వారాలుగా థియేటర్లు చాలా మటుకు లోటు బడ్జెట్ తో నడుస్తున్నాయి. రిలీజ్ కౌంట్ అయితే ఉంది కానీ కలెక్షన్లు లేక బిసి సెంటర్లు వెలవెలబోతున్నాయి.

అందుకే అఖండ మునుపటి జోష్ తీసుకొస్తుందనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారానికి సంబంధించి అదే రోజు నుంచి వెసులుబాటు ఉంటుందనేలా సంకేతాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహంగా ఉన్నారు. బెనిఫిట్ షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో మరీ తెల్లవారుఝామున ఆటలకు అనుమతులు ఉండవు కాబట్టి 8 నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆంధ్రలో సైతం ఇంచుమించు ఇవే టైమింగ్స్ ఉండొచ్చని అంటున్నారు. ఏరియాల వారిగా బయ్యర్లు కోట్ చేస్తున్న ఆఫర్లు క్రేజీగా ఉంటున్నాయట. ఫైనల్ ఫిగర్స్ ఇంకో రెండు మూడు రోజుల్లో రావొచ్చు.

లెజెండ్ తర్వాత బాలయ్యకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. అది కూడా బోయపాటి శీను సినిమానే. అందుకే అఖండ మీద ఈ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ట్రైలర్ వచ్చాక ఇది ఇంకా పెరిగిపోయింది. శ్రీకాంత్, జగపతిబాబు, భూమిక తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో బాలయ్య డబుల్ రోలా లేక మూడు పాత్రలా అనేది సస్పెన్స్ గా ఉంది. ఒకవేళ అఖండ కనక హిట్టు కొట్టి క్లిక్ అయితే ఆ తర్వాత పుష్ప, శ్యామ్ సింగ రాయ్, గని, బింబిసార లాంటి వాటికీ బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి

Also Read : RC 15: సినిమా రంగంలో కార్పొరేట్ కంపెనీల హవా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp