iDreamPost

World Cup 2023: ఇంకా పాకిస్థాన్‌ కు సెమీస్‌ ఛాన్స్‌! ఇండియా దయ ఉంటేనే..

  • Published Oct 28, 2023 | 9:03 PMUpdated Oct 28, 2023 | 9:03 PM

ఇండియాతో మ్యాచ్‌ తర్వాత ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలైన పాక్‌, ఆ వెంటనే ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలోను చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాక్‌ మానసికంగా కూడా దెబ్బతింది. తాజాగా సౌతాఫ్రికాతో శుక్రవారం చెన్నైలోని చెపాక్ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.

ఇండియాతో మ్యాచ్‌ తర్వాత ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలైన పాక్‌, ఆ వెంటనే ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలోను చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాక్‌ మానసికంగా కూడా దెబ్బతింది. తాజాగా సౌతాఫ్రికాతో శుక్రవారం చెన్నైలోని చెపాక్ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి.

  • Published Oct 28, 2023 | 9:03 PMUpdated Oct 28, 2023 | 9:03 PM
World Cup 2023: ఇంకా పాకిస్థాన్‌ కు సెమీస్‌ ఛాన్స్‌! ఇండియా దయ ఉంటేనే..

వన్డే వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్థాన్‌ను చాలా మంది క్రికెట్‌ నిపుణులు, అలాగే మాజీ క్రికెటర్లు సైతం హాట్‌ ఫేవరేట్‌గా, నాలుగు టైటిల్‌ ఫేవరేట్‌ టీమ్స్‌లో ఒక టీమ్‌గా భావించారు. అందుకు తగ్గట్లే ఆరంభంలో రెండు వరుస విజయాలు సాధించింది పాకిస్థాన్‌. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన పాక్‌, రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది. కానీ, మూడో మ్యాచ్‌లో టీమిండియాతో తలపడిన పాక్‌.. చిత్తు చిత్తుగా ఓడింది. పటిష్టమైన టీమిండియాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది బాబర్‌ సేన. దీంతో ఈ టోర్నీలో తొలి ఓటమి పొందిన పాక్‌.. అక్కడి నుంచి కోలుకోలేకపోతుంది. ఆ మ్యాచ్‌ తర్వాత పాక్‌కు అన్ని ఓటములే.

ఇండియాతో మ్యాచ్‌ తర్వాత ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలైన పాక్‌, ఆ వెంటనే ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలోను చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాక్‌ మానసికంగా కూడా దెబ్బతింది. తాజాగా సౌతాఫ్రికాతో శుక్రవారం చెన్నైలోని చెపాక్ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. సెమీస్‌ మ్యాచ్‌ల కంటే ముందు ప్రతి టీమ్‌ 9 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ లెక్కన పాకిస్థాన్‌ ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఆడేసింది. 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 4 పరాజయాలతో 4 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇంకా పాకిస్థాన్‌కు 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అయితే.. ఇంకా పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశాలు పూర్తిగా మూసుకోపోలేదు. ఇంకా చిన్న ఛాన్స్‌ ఉంది. అయితే.. పాక్‌ సెమీస్‌ చేరాలంటే.. టీమిండియా దయతోనే సాధ్యం అయ్యేలా ఉంది. అది ఎలాగంటే..

ప్రస్తుతం పాకిస్థాన్‌కు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌లతో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముందు పాక్‌ ఈ మూడు మ్యాచ్‌ల్లో మంచి రన్‌రేట్‌తో విజయం సాధించాలి. అలాగే టీమిండియా తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. లేదు టేబుల్‌ 1 లేదా 2వ స్థానంలో అయినా ఉండాలి. అలాగే సౌతాఫ్రికా సైతం 1 లేదా 2వ స్థానంలో ఉండాలి. ఇక న్యూజిలాండ్‌కు మిగిలి ఉన్న 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌ గెలవాలి. ఒక వేళ ఆ ఒక్కట కూడా నెగ్గకుంటే ఇంకా మంచింది. అంటే న్యూజిలాండ్‌ 4 లేదా 3 మ్యాచ్‌లు ఓడిపోవాలి. పాకిస్థాన్‌, ఇండియా తమ మిగిలిన మ్యాచ్‌లు అన్ని గెలిస్తే.. బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌.. టోర్నీ నుంచి ఇంటికి వెళ్తాయి.

ఇండియా, సౌతాఫ్రికా టాప్‌ టూలో ఉంటే మిగిలిన రెండు స్థానాల కోసం ఆసీస్‌, కివీస్‌, పాక్‌, లంక, ఆఫ్ఘనిస్థాన్‌ పోటీ పడతాయి. ఆసీస్‌, కివీస్‌ ఏదో ఒకటి టీమ్‌ మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ఇలా చాలా ఇక్వెషన్స్‌ ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా అన్ని మ్యాచ్‌లు గెలవడం పాకిస్థాన్‌కు బాగా కలిసి వస్తుంది. అందుకే పాక్‌ సెమీస్‌ చేరాలంటే ఇండియాపై ఎక్కువగా ఆధారపడాలి, ఇండియా గెలుపు కోసం ప్రార్థించాలి. అంతకుమించి పాక్‌ చేసేందేం లేదు. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా పాక్‌ ఓడినా.. ఇక వారిని టీమిండియా కూడా కాపాడలేదు. మూటెముళ్లె సర్దుకుని పాకిస్థాన్‌కు వెళ్లిపోవడమే. మరి పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి