iDreamPost

బిగ్ బాస్ 4 ఫినాలేకు స్టార్ గెస్ట్

బిగ్ బాస్ 4 ఫినాలేకు స్టార్ గెస్ట్

గత తొంభై రోజులుగా వినోదాన్ని విమర్శల్ని మూటగట్టుకున్న బిగ్ బాస్ 4 ఫైనల్ అంకానికి రెడీ అవుతోంది. ఎవరు టైటిల్ విన్నర్ అనే దాని గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ అఖిల్ అభిజిత్ ల మధ్యే టఫ్ కాంపిటీషనని ఆన్ లైన్ లో వినిపిస్తున్న మాట. అలా అని హారికను, సొహైల్ ను తక్కువ చేసి చెప్పలేం కానీ ఏదైనా జరిగే ఛాన్స్ ఉన్న హౌస్ మీద ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రాలేం. నిజానికి సీజన్ 4 మొదటి మూడు సిరీస్ ల కంటే తక్కువ రేటింగ్ తెచ్చుకుంది. వీకెండ్స్ తో పాటు స్పెషల్ ఎపిసోడ్స్ బాగానే ఆకట్టుకున్నా ఓవరాల్ గా చూసుకుంటే షో స్థాయి రెస్పాన్స్ రాని మాట నిజం.

ఇక ఫినాలే విషయానికి వస్తే దీన్ని డిసెంబర్ 19న షూట్ చేయబోతున్నారు. అంటే 20న టెలికాస్ట్ అవుతుందన్న మాట. గెస్ట్ గా ఎవరు రావొచ్చన్న అంచనాలు మొదలైపోయాయి. న్యాచురల్ స్టార్ నానిని అడిగినట్టుగా టాక్ వచ్చింది కానీ టక్ జగదీశ్ ఏకధాటి షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల సారీ చెప్పేశాడట. దీంతో ఒకదశలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి రెండు మూడు ఆప్షన్స్ అనుకున్నప్పటికీ అవేవి ఫలితం ఇవ్వలేదని తెలిసింది. దీంతో మొదటి సీజన్ ని బ్రహ్మాండంగా హోస్ట్ చేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నే ఒప్పించిన్నట్టు ఫ్రెష్ అప్ డేట్.

తారక్ వస్తే ఫైనల్ పోరు మంచి రసవత్తరంగా ఉంటుంది.స్క్రిప్ట్ కి తన సహజమైన టైమింగ్ తో ఫన్ జోడిస్తాడు కనక ఎంటర్ టైన్మెంట్ కు లోటు ఉండదు. ఆ టైంలో ఆర్ఆర్ఆర్ షూట్ కూడా లేకపోవడంతో జూనియర్ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. నాగార్జున పర్సనల్ గా అడిగినట్టు తెలిసింది. వచ్చే సంవత్సరం బిగ్ బాస్ 5 కి హైప్ రావాలంటే ఇప్పటి సీజన్ మీద నెగటివిటీని సాధ్యమైనంత తగ్గించాలి. మోనాల్ ని చివరిదాకా కొనసాగించడం, మంచి పార్టిసిపెంట్స్ ని త్వరగా పంపించడం లాంటి పరిణామాల పట్ల ప్రేక్షకులు హ్యాపీగా లేరు. అందుకే ఫినాలే అంచనాలకు మించి సాగాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి