iDreamPost

ఇంటర్ అర్హతతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 30 వేల జీతం.. త్వరపడండి

  • Published Apr 10, 2024 | 4:34 PMUpdated Apr 10, 2024 | 4:34 PM

ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెట్ ఆ.. అయితే మీ కోసమే ఈ వార్త. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెట్ ఆ.. అయితే మీ కోసమే ఈ వార్త. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

  • Published Apr 10, 2024 | 4:34 PMUpdated Apr 10, 2024 | 4:34 PM
ఇంటర్ అర్హతతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 30 వేల జీతం.. త్వరపడండి

ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కనే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. చిన్నదో.. పెద్దదో గవర్నమెంట్ జాబ్ అయితే చాలనుకుంటారు. అందుకు ప్రధాన కారణం.. ఉద్యోగ భద్రత, మంచి వేతనం.. అదనపు ప్రయోజనాలు. అందుకే చాలా మంది ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మాములుగా గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ లో జాబ్ రావాలన్నా.. కనీసం డిగ్రీ అయిన పాస్ అయి ఉండాలి. అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత సరిపోతుంది. అదుగో అలాంటి ఉద్యోగాలకు సంబంధించిందే ఈ వార్త. ఇంటర్ పూర్తి చేసిన వారు సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా.. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ 2024 సంవత్సరానికిగాను నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. మే 7 దరఖాస్తులకు చివరితేది. ఇక.. ఈ పోస్టులకు సంబంధించి టైర్‌-1(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) ఎగ్జామ్‌ జూన్‌-జులైలో నిర్వహిస్తారు. టైర్‌-2 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) పరీక్ష నిర్వహణ గురించి త్వరలో ప్రకటిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే.. దీని మీద క్లిక్‌ చేయండి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్యమైన సమాచారం..

అర్హత:

  • ఇంటర్‌ లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
  • 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో గణితం ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

ఏజ్ లిమిట్:

  • 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు.
  • ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటాయి.

వేతనం..

  • ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు రూ.25,500-81,100.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఏ పోస్టులకు రూ.29,200-92,300.

ఎంపిక విధానం:

  • ఈ పోస్టులకు టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
  • ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

రూ.100.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు:

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల తదితర ప్రదేశాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి