iDreamPost
android-app
ios-app

Sriranga Neethulu OTT: OTT లోకి సుహాస్ శ్రీరంగనీతులు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published May 20, 2024 | 6:39 PM Updated Updated May 20, 2024 | 6:39 PM

కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ లోకి వస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడిచినా కానీ ఓటీటీ కి ఎప్పుడు వస్తాయన్నది తెలియడంలేదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా కాస్త ఆలస్యంగా ఓటీటీ లోకి వస్తుంది.

కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ లోకి వస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడిచినా కానీ ఓటీటీ కి ఎప్పుడు వస్తాయన్నది తెలియడంలేదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా కాస్త ఆలస్యంగా ఓటీటీ లోకి వస్తుంది.

  • Published May 20, 2024 | 6:39 PMUpdated May 20, 2024 | 6:39 PM
Sriranga Neethulu OTT: OTT లోకి సుహాస్ శ్రీరంగనీతులు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

గత రెండు నెలలలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు దాదాపు ఓటీటీ లోకి వచ్చేశాయి. కానీ అసలు థియేటర్ లో రిలీజ్ అయిందా లేదా అని అనిపించిన ఓ సినిమా మాత్రం ఇంకా ఓటీటీ లోకి రాలేదు. అదే సుహాస్ నటించిన “శ్రీరంగ నీతులు”. సుహాస్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే . వినూత్నమైన కథలతో.. ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యలో సుహాస్ నటించిన సినిమాలలో రెండు మాత్రమే ఓటీటీ లోకి వచ్చాయి. ఇప్పుడు మరొక సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ గురించి టాక్ నడుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో సుహాస్ నటించిన సినిమాలంటే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం సినిమాలనే అందరికి తెలుసు. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. డీసెంట్ టాక్ ను సంపాదించుకున్నాయి. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా కానీ.. కథ పరంగా మాత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ఇక ఈ సినిమాలలో సుహాస్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించడంలో.. సుహాస్ ఎప్పుడు విజయాన్ని సాధిస్తాడు. ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి చూసేసాం. అయితే ఈ రెండు సినిమాలకు గ్యాప్ లో సుహాస్ శ్రీరంగ నీతులు అనే మరొక సినిమాను కూడా తీశాడు. వరుస సినిమాలు రిలీజ్ అవ్వడం వలనో లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. అసలు ఈ సినిమా థియేటర్ లోకి వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు.

ఈ సినిమా ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. సినిమా విడుదలయ్యి నెల రోజులు దాటిపోయినా కూడా ఇంకా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా రాలేదు. ఈ సినిమాలో సుహాస్ తో పాటు బేబీ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తీక్, రుహాని శర్మ నటించారు. ఈ సినిమా థియేటర్ కు వచ్చింది అని కూడా చాలా మందికి తెలియదు. పైగా విడుదలైన ఇన్ని రోజులకు ఈ సినిమా ఓటీటీ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోని లివ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ లోకి ఆలస్యంగా వస్తుంది అనుకుంటే.. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఇంకాస్త ఆలస్యం చేస్తూ.. జూన్ 7 న స్ట్రీమింగ్ చేయనున్నారట మేకర్స్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది .. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

v

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet