iDreamPost

నేనెందుకు కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పాలన్న శ్రీలంక క్రికెటర్.. ఏకిపారేస్తున్న విరాట్ ఫ్యాన్స్!

నిన్న వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అజేయ సెంచరీతో వన్డేల్లో 49 సెంచరీ పూర్తి చేసుకుని క్రికెట్ గాడ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. దీనిపై స్పందించిన శ్రీలంక ప్లేయర్ కోహ్లీ సెంచరీ సాధిస్తే తానెందుకు అభినందనలు తెలపాలంటూ వెకిలి నవ్వులు నవ్వాడు.

నిన్న వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అజేయ సెంచరీతో వన్డేల్లో 49 సెంచరీ పూర్తి చేసుకుని క్రికెట్ గాడ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. దీనిపై స్పందించిన శ్రీలంక ప్లేయర్ కోహ్లీ సెంచరీ సాధిస్తే తానెందుకు అభినందనలు తెలపాలంటూ వెకిలి నవ్వులు నవ్వాడు.

నేనెందుకు కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పాలన్న శ్రీలంక క్రికెటర్.. ఏకిపారేస్తున్న విరాట్ ఫ్యాన్స్!

విరాట్ కోహ్లీ.. ఈ పేరు ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. రన్ మెషిన్ గా, చేజ్ మాస్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కింగ్ కోహ్లీ. క్లిష్ట పరిస్థితుల్లో సైతం బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారిస్తూ జట్టును గెలిపించడంలో కోహ్లీ కృషి వర్ణించలేనిది. నిన్న వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అజేయ సెంచరీతో వన్డేల్లో 49 సెంచరీ పూర్తి చేసుకుని క్రికెట్ గాడ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. దీనిపై స్పందించిన శ్రీలంక ప్లేయర్ కోహ్లీ సెంచరీ సాధిస్తే తానెందుకు అభినందనలు తెలపాలంటూ వెకిలి నవ్వులు నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ శ్రీలంక ప్లేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న తన 35వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ సెంచరీల రికార్డు కూడా సమం చేసాడు. దాంతో ప్రపంచం నలుమూలల నుంచి విరాట్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ ఘనత సాధించిన భారత మాజీ కెప్టెన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు. అయితే శ్రీలంక అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కుశాల్ మెండిస్ విరాట్‌పై విచిత్రమైన రియాక్షన్ ఇచ్చాడు. అయితే ఇదే విషయం గురించి శ్రీలంక క్రికెటర్ కుసాల్ మెండిస్‌ని ప్రశ్నించగా అతను దురుసుగా సమాధానం ఇచ్చాడు. అసలు నేనెందుకు విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పాలి అని ఎదురు ప్రశ్న వేసారు. కోహ్లీ ఆటకు ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్లే ఫిదా అయిపోతున్న తరుణంలో, అంత గొప్ప ప్లేయర్ పట్ల శ్రీలంక ఆటగాడు దురుసుగా ప్రవర్తించాడు. కుశాల్ ఈ విధంగా మాట్లాడడంపై విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదేం క్రీడా స్ఫూర్తి అంటూ ఏకిపారేస్తున్నారు.

ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంక జట్టు తన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌ని బంగ్లాదేశ్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ మెండిస్ ఆదివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 49వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీని అభినందించాలనుకుంటున్నారా అని జర్నలిస్ట్ అడిగాడు. దీనికి అతను షాకింగ్ రియాక్షన్ ఇచ్చి, ‘నేను అతనిని ఎందుకు అభినందించాలి?’ మెండిస్ బదులిచ్చి నవ్వడం మొదలుపెట్టాడు. 49 సెంచరీలు చేస్తే ఎవరికి గొప్ప అన్నట్లుగా ప్రవర్తించాడు. కుశాల్ అలా మాట్లాడడంపై క్రీడాలోకం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కుశాల్ పై క్రీడా ప్రముఖులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కోల్‌కతాలోని ఇదే మైదానంలో 2009లో శ్రీలంకపై వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ కూడా చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కింగ్ కోహ్లీ మరో అడుగు దూరంలో ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి