iDreamPost

Squid Game : రికార్డుల ప్రకంపనలు సృష్టిస్తున్న కొరియన్ డ్రామా

Squid Game : రికార్డుల ప్రకంపనలు సృష్టిస్తున్న కొరియన్ డ్రామా

వెబ్ సిరీస్ అంటే ఆ ఎవరు చూస్తారు ఇంచుమించు సీరియల్లాగే ఉంటుంది కదాని కొందరనుకుంటున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవి సృష్టిస్తున్న సంచలనాలు చూస్తే మాత్రం నోరెళ్ళబెట్టక మానరు. దానికి సాక్ష్యంగా నిలుస్తోంది స్క్విడ్ గేమ్స్. గత నెల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ చాలా తక్కువ టైంలోనే ఆ ప్లాట్ ఫార్మ్ లోని పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తోంది. దీని హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ మన భారతీయ రూపాయల్లో చూసుకుంటే 160 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిందట. ఆదాయం ఎంతో తెలుసా. ఇప్పటికే 6800 కోట్లకు దగ్గరలో ఉందని అక్కడి మీడియా సమాచారం. ఇదింకా భారీగా పెరగబోతోంది.

ఈ లెక్కన రూపాయకు నలభై రూపాయలు లాభం వచ్చినట్టే. ఇంతగా ఈ కొరియన్ డ్రామాలో ఏముందంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆటలను ప్రాణాంతకంగా మార్చి జనాలను చంపడం.కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, డైరెక్షన్ తో ఆద్యంతం ఇది కళ్ళు పక్కకు తిప్పుకోకుండా చేస్తుంది. మొదటి ఎపిసోడ్ మొదలుపెట్టిన అరవై శాతం వ్యూయర్స్ కేవలం ఇరవై మూడు రోజుల్లోనే మొత్తం ఫినిష్ చేశారంటేనే ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 130 మిలియన్లకు పైగానే దీన్ని చూశారని అంతర్గత రిపోర్ట్స్ నుంచి వస్తున్న సారాంశం. ఊహించని రెస్పాన్స్ చూసి నెట్ ఫ్లిక్స్ సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దీని డిమాండ్ పుణ్యమాని స్క్విడ్ గేమ్స్ అనే పేరుకి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. యుఎస్ లో ఒక అఫీషియల్ స్టోర్ పెడితే జనాల తాకిడి తట్టుకోలేక పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాల్సి వచ్చిందట. మనీ హీస్ట్, డార్క్, స్ట్రేంజర్ థింగ్స్, బ్రేకింగ్ బ్యాడ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లన్నీ ఇప్పుడీ స్క్విడ్ గేమ్స్ ముందు చిన్నబోతున్నాయి. నెట్ ఫ్లిక్స్ పై లెక్కలేవి అధికారికంగా చెప్పలేదు కానీ వరల్డ్ వైడ్ మీడియాలో దీని మీద పెద్ద చర్చే జరుగుతోంది. కేవలం థియేటర్ ఎంటర్ టైన్మెంట్ మాత్రమే వేల కోట్ల రెవిన్యూని ఇస్తుందన్న మాటలను బ్రేక్ చేస్తూ స్క్విడ్ గేమ్స్ సృష్టించిన సంచలనం ఇప్పుడు రెండో సీజన్ పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచిన మాట వాస్తవం

Also Read : Shyam Singha Roy : గట్టి పోటీ మధ్య న్యాచురల్ స్టార్ సాహసం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి