iDreamPost

Special OPS1.5 : స్పెషల్ ఓపిఎస్ 1.5 రిపోర్ట్

Special OPS1.5 : స్పెషల్ ఓపిఎస్ 1.5 రిపోర్ట్

వెబ్ సిరీస్ లు చాలా వస్తుంటాయి కానీ వాటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచేవి తక్కువ. అందులోనూ ఓటిటి ట్రెండ్ కి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సదరు సంస్థలు సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వీటిని నిర్మిస్తున్నారు. కొన్ని చక్కని ఆదరణకు నోచుకుంటున్నాయి. అమెజాన్ ప్రైమ్ కు ది ఫ్యామిలీ మ్యాన్ ఉన్నట్టే డిస్నీ హాట్ స్టార్ కు స్పెషల్ ఓపిఎస్ ఉంది. కెకె మీనన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. కోట్ల రూపాయల బడ్జెట్ కు వెనుకాడకుండా ఖరీదైన ఫారిన్ లొకేషన్లలోనూ షూటింగ్ జరుపుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కొత్త సీజన్ మొన్న వచ్చింది. దాని రిపోర్ట్ చూద్దాం.

ది కొనసాగింపు కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఫస్ట్ సీజన్ లో మిస్ అయిన కొన్ని లూజ్ ఎండ్స్ తో పాటు రా ఏజెంట్ హిమ్మత్ సింగ్(కెకె మీనన్) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను ఇందులో టచ్ చేశారు. భారతదేశం నియమించిన కొందరు విదేశీ అధికారులను శత్రువులు హానీ ట్రాప్(అమ్మాయిని ఎరగవేసి రహస్యాలు రాబట్టుకోవడం) ద్వారా ఎలా మోసం చేశారు, వాళ్ళ పతనానికి ఎలా కారణం అయ్యారు అనేది ఇందులో మెయిన్ పాయింట్. దాన్ని డీల్ చేసిన విధానం కూడా బాగుంది. ఎంతటి వారైనా ప్రలోభపడితే దాని పర్యవసానాలు ఎలా ఉందో ఇందులో చూపించారు. ఈ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి

కేవలం నాలుగు ఎపిసోడ్లు మాత్రమే ఉన్న ఈ స్పెషల్ ఓపిఎస్ 1.5 ఓ మూడు గంటల సమయం కేటాయిస్తే చాలు మొత్తం చూసేయొచ్చు. నీరజ్ పాండే రచన చేసిన ఈ థ్రిల్లర్ కి శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ అంత ఎగ్జైటింగ్ గా ఉండదు కానీ ఈ వన్ పాయింట్ ఫైవ్ మరీ నిరాశపరిచే విధంగా సాగదు. షూటింగ్ త్వరగా పూర్తి చేయడం వల్ల క్వాలిటీలో కొంత కాంప్రోమైజ్ కనిపిస్తుంది కానీ మరీ ఎక్కువ రాజీ పడలేదు. హిమ్మత్ సింగ్ చుట్టే కథను తిప్పకుండా ఇతర పాత్రల చుట్టూ కథనం నడిపించడం బాగుంది. ఓవరాల్ గా స్పెషల్ ఓపిఎస్ చూసి నచ్చినవాళ్లు హ్యాపీగా దీన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీన్నొకటే విడిగా చూస్తే మాత్రం అర్థం కాదు.

Also Read : Theatres : ఇలా అయితే థియేటర్లకు ఉత్సాహం వచ్చేదెప్పుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి