iDreamPost

Chiranjeevi: మెగాస్టార్ కమిట్మెంటే వేరబ్బా….

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాగ్రౌండ్ లేకుండా జీవితంలో ఎదగాలనుకునే ఎందరికో ఆయన ఆదర్శం. అలానే సమాజ హితం కోసం అయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అందరిని ఆకర్షిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాగ్రౌండ్ లేకుండా జీవితంలో ఎదగాలనుకునే ఎందరికో ఆయన ఆదర్శం. అలానే సమాజ హితం కోసం అయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అందరిని ఆకర్షిస్తోంది.

Chiranjeevi: మెగాస్టార్ కమిట్మెంటే వేరబ్బా….

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, హీరోలలో కూడా మెగాస్టార్ వేరయా అనాల్సిన సందర్భాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి. ఆయనెంత పెద్ద హీరో అయినా, ఎంతటి సంచలనకారుడైనా, ఎన్ని ప్రభంజనాలను పుట్టించినా, తానూ ఒక సామాన్య పౌరుడునని, భారతీయ పౌరుడిగా తన బాధ్యతలను ఎన్నడూ మరచిపోని ఓ గొప్ప సంస్కారి మెగాస్టార్ చిరంజీవి. ప్రతీ మలుపులోనూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి, తదనుగుణంగా ప్రవర్తించే నిత్యచైతన్యశీలి ఆయన.

మెంబర్ ఆప్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఓటు హక్కు విలువను, ప్రాధాన్యతను కూడా గుర్తు చేశారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియా వీర లెవెల్లో వైరల్ అయింది. ఆయన అక్షరాలలోనే……..’’ త్వరలోనే మన దేశ 18వ లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ యేడు 18 ఏళ్ళు నిండిన యువత అమూల్యమైన ఓటు హక్కును పొందుతారు. మీ మొదటి ఓటును దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం వినియోగించండి. తప్పనిసరిగా ఓటు వేయండి’’ అని పిలుపునిచ్చారు.

Megastars commitment is different

ఎవరికి పట్టింది ఇటువంటి విషయం? ఎవడి గోల వాడిది అనే ఈ వ్యాపార ప్రపంచంలో ఇటువంటి సామాజిక బాధ్యతను ఫీలయ్యేవారు ఎంత మంది ఉంటారు? అదే మరి మెగాస్టార్ వ్యక్తిత్వం. ఆయన ఏ విషయాన్ని ఏనాడూ విస్మరించలేదు. కరోనా టైంలో కూడా చేతులు ఎలా వాష్ చేసుకోవాలి….ఎంత సేపు వాష్ చేసుకుంటే కరోనా దరి చేరదు అనే అంశం మీద ఆయన టీవీల్లో డెమో ఇచ్చారు. 20 సెకండ్ల పాటు తాను వాష్ చేసుకుని అందరిలో ఆ ప్రాక్టీసును నాటడానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఇదే కాదు….ఆయన సన్నిహితులకు బాగా తెల్సిన విషయం….చిన్నపిల్లలు తలసీమియా వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు….వారికోసం ఏం చెయ్యాలి అనే నిరంతరం తపన, ఆవేదన చెందేవారు.

ఓ కమర్షియల్ హీరో అంటే ఏంటి? తన మార్కెట్ పెరుగుతున్నకొద్దీ, పారితోషకాల ఫిగర్ప్ ఎలా పెంచుకోవాలి, ఎటువంటి కథలు చేయాలి, ఎలాటి సినిమాలు చేస్తే తన స్థానం పదిలంగా సుస్థిరమైపోతుంది అనే అంశాలపైనే నిరంతరం వర్కౌట్ చేస్తుంటారు. అది సహజం కూడా. కానీ చిరంజీవి మాత్రం తన ప్రొఫెషన్ తో పాటు, సామాజికమైన బాధ్యతల గురించి ఎల్లప్పుడూ చర్చిస్తుంటారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంటారు. మద్రాసులో ఉన్నరోజుల్లోనే పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిసి, వారికి మెగాబ్రదర్ ద్వారా స్వయంగా ఆర్ధిక సహాయాన్ని అందించారు. అప్పటికీ ఆయనలో రాజకీయరంగప్రవేశం అన్న ఆలోచన లేశమాత్రం కూడా లేదు. కరోనా టైంలో సినిమా కార్మికులకు పనిలేక పస్తులుండాల్సిన గడ్డురోజులు గడుస్తుంటే, ఆ దురవస్థని మొదటగా గుర్తించింది మెగాస్టార్ కదా.

ఆయన చొరవతో, చలువతో వేలాది సినిమా కార్మికులకు రెండు పూటల ఇల్లు గడిచింది. కరోనా వ్యాధిగ్రస్తులలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, దీనికి ప్రభుత్వాలు మాత్రమే కాదు, పౌరులెవరైనా నడుం కట్టుకోవచ్చు అనే నైతికబాధ్యతను ప్రదర్శించి, ఊరూరా తన ఖర్చులతో ఊరూరా ఆక్సిజన్ సప్లయ్ చేసి ఎందరివో ప్రాణాలను కాపాడిన పవిత్రమైన సాంఘికసేవా తత్పరుడు మెగాస్టార్. ఇంక సరే…బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ఒక చరిత్ర. ఏ అంతర్జాతీయ హీరో కలలోకి కూడా రాని వ్యవహారం ఇది. దేవుడిచ్చిన తన సంపదని, పలుకుబడిని తోటివారి కోసం ఉపయోగపెట్టే నైతికతే దైవత్వం అంటే. నలుగురి కోసం నిలబడేవాడే నాయకుడు. సినిమాల వరకే పరిమితమైపోతే కేవలం సినిమా హీరోలుగానే మిగిలిపోతారు. కానీ, మెగాస్టార్ అంతకు మించిన ఓ అద్భుతం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి