iDreamPost

“పాట అమరం..గాన గాంధర్వుడు అమరం..”

“పాట అమరం..గాన గాంధర్వుడు అమరం..”

ఎస్పీ బాలసుబ్రమణ్యం..బహుశా ‘పాట’ కోసం జన్మించారేమో అన్నంతలా పాటతో బంధాన్ని ఏర్పరుచుకున్నారు మనం గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. ఆ అమృతమైన స్వరాన్ని ప్రత్యక్షముగా వీక్షించాలని ఆ దేవునికి అనిపించిందేమో అందుకే ఆయన్ని మన నుండి దూరం చేసి ఆయనకి దగ్గరకి తీసుకెళ్లి నేటికి 2 సంవత్సరాలు పూర్తయింది.

ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ‘బాలు’ అని పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి నేడు. సినీ నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారునిగా, నిర్మాతగా ఎంతో సంపాదించుకొని ప్రజలందరి హృదయాల్లో ఆయన చిరస్మనీయునిగా నిలిచిపోయారు బాలు. అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించిన ఘనత మన బాలు ది.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే బాలు గారు నెల్లూరులో జన్మించారు. తండ్రి ఎస్పీ సాంబమూర్తి.. తల్లి శకుంతలమ్మ. బాలుకు సోదరి ఎస్‌పీ శైలజతో సహా ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్ కూడా సినీ గాయకునిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బాలు గారు ఇంజనీర్‌ కావాలనే ఉద్దేశంతో అనంతపురంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరారు. తర్వాత 1966లో వచ్చిన మర్యాద రామన్న అనే సినిమాతో గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు.

తెలుగు సినిమాలలో ఆయన గాత్రానికి 25 నంది అవార్డులను పొందాడు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఎన్నో అవార్డులు ఆయనకు దక్కాయి. ఇవే కాకుండా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందిన ఘనత ఆయన సొంతం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోని తన పాటలకు ఉత్తమ నేపథ్య గాయకునిగా ఆరు జాతీయ అవార్డులు అందుకున్నారు బాలు.

2012లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 2016లో సిల్వర్ పీకాక్ మెడల్‌తో కూడిన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌తో ఆయనను సత్కరించారు. దేశంలోనే అత్యున్నత అతను పౌర పురస్కారాలు పద్మశ్రీ..పద్మ భూషణ్ ఆయనను వరించాయి. ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కోవిడ్ బారిన పడి 2020 సెప్టెంబర్ 25న చెన్నై లోని ఎంజీఎం హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు..మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో అమరునిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి