iDreamPost

బిడ్డకు జన్మనిస్తే రూ.62 లక్షలు.. బంపరాఫర్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ!

  • Published Feb 09, 2024 | 9:30 PMUpdated Feb 09, 2024 | 9:30 PM

బిడ్డకు జన్మనిస్తే లక్షలాది రూపాయలు ఇస్తామంటూ ఓ ప్రముఖ సంస్థ బంపరాఫర్ ఇచ్చింది. ఆ కంపెనీ ఎందుకిలా ఆఫర్ ఇచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బిడ్డకు జన్మనిస్తే లక్షలాది రూపాయలు ఇస్తామంటూ ఓ ప్రముఖ సంస్థ బంపరాఫర్ ఇచ్చింది. ఆ కంపెనీ ఎందుకిలా ఆఫర్ ఇచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 09, 2024 | 9:30 PMUpdated Feb 09, 2024 | 9:30 PM
బిడ్డకు జన్మనిస్తే రూ.62 లక్షలు.. బంపరాఫర్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ!

ఉద్యోగులను ఉత్సాహపర్చేందుకు కంపెనీలు ఆఫర్లు ప్రకటించడం మామూలే. ఇంకా బాగా పని చేయాలని, సంస్థను లాభాల్లో నడిపించాలనే ఉత్సాహంతో బోనస్​లు ఇస్తుంటాయి. నెల మొత్తం కష్టపడే ఎంప్లాయీస్​కు ఈ ప్రోత్సాహకాలు ఎంతో ఊరటను ఇస్తాయి. ఇంకా కష్టపడి పని చేసేందుకు, కంపెనీ విధించిన టార్గెట్లను రీచ్ అయ్యేందుకు కావాల్సిన ఎంకరేజ్​మెంట్​ను అందిస్తాయి. ఇందులో భాగంగా మిక్సీలు, టీవీలు, క్యాష్​ ప్రైజ్​లతో పాటు విహార యాత్రకు వెళ్లేందుకు ట్రిప్ టికెట్స్ ఇవ్వడం వంటివి కామనే. అయితే ఒక సంస్థ మాత్రం బిడ్డను కంటే లక్షలాది రూపాయలు ఇస్తామంటూ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. అసలు ఆ కంపెనీ ఏంటి? ఎందుకీ ఆఫర్ ఇచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సౌత్ కొరియాకు చెందిన బూయంగ్ అనే నిర్మాణ సంస్థ తమ ఉద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఎంప్లాయీస్​కు బోనస్​గా ఏకంగా రూ.62 లక్షలు చెల్లిస్తామని తెలిపింది. ఈ ఆఫర్​ను మూడేళ్ల నుంచి కొనసాగిస్తున్నామని పేర్కొంది బూయంగ్. ఇందులో భాగంగా 2021 నుంచి 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.43.65 కోట్లు చెల్లించామని పేర్కొంది. తమ సంస్థలో పని చేస్తున్న మహిళ, పురుష ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒక్కసారికో లేదా ఒక్కకాన్పుకో కాదు.. జన్మనిచ్చి ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని బూయంగ్ చెప్పుకొచ్చింది. అయితే ఈ కంపెనీ ఇలా చేయడం వెనుక సదుద్దేశం ఉందని చెప్పాలి. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తోంది.

సౌత్ కొరియాలో ఏటికేడు జననాల రేటు క్షీణిస్తూ వస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ఎంత కృషి చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఖర్చులు పెరిగిపోవడంతో ఉన్న పిల్లల్ని పెంచడమే భారంగా మారిన పరిస్థితుల్లో ఎక్కువ మందిని కనమంటే ఎలా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో బూయంగ్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. బోనస్​లు ప్రకటిస్తూ, ఇంకా పలు మినహాయింపులు, ఆఫర్లు ఇస్తూ ఎంప్లాయీస్​కు ప్రోత్సహిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. జననాల రేటు క్షీణించకుండా ఆ సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. మరి.. బిడ్డకు జన్మనిస్తే రూ.62 లక్షలు ఇస్తామంటూ సౌతా కొరియన్ కంపెనీ బంపరాఫర్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి