iDreamPost

రైలు ప్రయాణీకులకు శుభవార్త: ఇక RAC వచ్చినా కంగారు పడాల్సిన పనిలేదు

రైలు ప్రయాణీకులకు శుభవార్త: ఇక RAC వచ్చినా కంగారు పడాల్సిన పనిలేదు

రైలు ప్రయాణాల కోసం ఐఆర్సీటీసీ వంటి యాప్ లు లేదా ఇతర ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేస్తూ ఉంటాం. ప్రయాణంలో బెర్తు ఖరారైతే ఫర్వాలేదు కానీ, ఆర్ఎసీ వచ్చినప్పుడే అసలు కంగారు మొదలవుతుంది. ప్రయాణీకుల్లో ఈ ఆందోళనను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

రైలు ప్రయాణాల్లో ఆర్ఏసీ వచ్చినా బెర్తుల కేటాయింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం కేటాయింపులను ఆన్ లైన్ కు మార్చింది. దీని ద్వారా ముందుగా ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో తొలుత వారికే సదురు బెర్తుల్ని కేటాయించేందుకు ఆన్ లైన్ వ్యవస్థను సిద్ధం చేసింది.

దీని ద్వారా పారదర్శకతతో పాటు టీసీలకు పని భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంతో ఇప్పటివరకు పేపర్లతో కుస్తీలు పడుతూ కనిపించిన టీసీలు ఇకమీద ట్యాబ్ ల ద్వారా ప్రయాణీకుల  వివరాల్ని సేకరిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి