iDreamPost

వందే భారత్ బుల్లెట్ రైళ్లు తెచ్చేందుకు.. అదిరిపోయే ప్లాన్ చేస్తున్న కేంద్రం

బెల్లెట్ ట్రైన్ ఇప్పటి వరకు విదేశాల్లోనే చూశాం. కానీ త్వరలోనే బుల్లెట్ రైళ్లు భారత్ లో కూడా పరుగులు పెట్టనున్నాయి. వందే భారత్ బుల్లెట్ రైళ్లు తెచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.

బెల్లెట్ ట్రైన్ ఇప్పటి వరకు విదేశాల్లోనే చూశాం. కానీ త్వరలోనే బుల్లెట్ రైళ్లు భారత్ లో కూడా పరుగులు పెట్టనున్నాయి. వందే భారత్ బుల్లెట్ రైళ్లు తెచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.

వందే భారత్ బుల్లెట్ రైళ్లు తెచ్చేందుకు.. అదిరిపోయే ప్లాన్ చేస్తున్న కేంద్రం

భారతీయ రైల్వేలు ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందింది. అయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం హై స్పీడ్ రైళ్లను తెచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఇప్పటికే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టి సక్సెస్ అయ్యింది. వందే భారత్ ట్రైన్లకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఇప్పుడు కేంద్రం వందే భారత్ బుల్లెట్ రైళ్లను తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాక టికెట్ రేట్లు పెరిగాయి. అయినా కూడా దేశ ప్రజలు బుల్లెట్ రైళ్లను భారత్ లో కూడా నడపాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టి వందే భారత్ బుల్లెట్ రైళ్లను తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో మాదిరిగానే భారత్ లో కూడా బుల్లెట్ రైళ్లను నడపాలని ప్రభుత్వం అనుకుంటుందట. అయితే ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు సిద్దమవుతోంది. అయితే దేశీయంగా వందే భారత్ బుల్లెట్ రైళ్లను తయారు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దీని ద్వారా భారత్ కూడా 52 సెకండ్లలోనే రైలును గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా చెయ్యాలనుకుంటోంది. దీని కోసం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మేకిన్ ఇండియాలో భాగంగా హైస్పీడ్ రైళ్లను తయారుచెయ్యాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత సౌకర్యంగా మారనుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా సొంతంగా హైస్పీడ్ రైళ్లను తయారుచేసుకునే దేశంగా అవతరించేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు అంటున్నారు ఇది తెలిసిన వారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి