iDreamPost

ప్రియురాలిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్!

  • Author Soma Sekhar Published - 03:01 PM, Tue - 5 December 23

సెలబ్రిటీలు ఒక్కొక్కరు తమ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మరో స్టార్ పేసర్ కూడా ఓ ఇంటివాడైయ్యాడు.

సెలబ్రిటీలు ఒక్కొక్కరు తమ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మరో స్టార్ పేసర్ కూడా ఓ ఇంటివాడైయ్యాడు.

  • Author Soma Sekhar Published - 03:01 PM, Tue - 5 December 23
ప్రియురాలిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ ముకేశ్ కుమార్ పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ మధ్యలోనే వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితులురాలినే అతడు జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడు. తాజాగా మరో స్టార్ పేసర్ కూడా ఓ ఇంటివాడైయ్యాడు. తన ప్రియురాలినే వివాహం చేసుకుని బ్యాచ్ లర్ లైఫ్ కు ముగింపు పలికాడు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే టీమిండియా స్టార్ పేసర్ ముకేశ్ కుమార్ కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ బౌలర్ ఓ ఇంటివాడైయ్యాడు. సౌతాఫ్రికా యంగ్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ తన చిరకాల ప్రియురాలిని పెళ్లిచేసుకున్నాడు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు ఈ సఫారీ పేస్ గన్. అయితే అతడి లవర్ గురించి ఎక్కువ సమాచారం దొరకనప్పటికీ.. గతంలో వీరిద్దరు చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సహచర క్రికెటర్లతో పాటుగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో కొయెట్జీ అద్బుతంగా రాణించి.. అందరి మన్ననలు పొందాడు. అన్రిచ్ నోర్జే గాయపడటంతో జట్టులోకి వచ్చిన అతడు కేవలం 8 మ్యాచ్ ల్లోనే 19.80 సగటుతో 20 వికెట్లు పగడొట్టి.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 5వ ప్లేస్ లో నిలిచాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ఇతడి కోసం ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధరను పెట్టేందుకు యాజమాన్యలు పోటీపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కోయెట్జీ కొనుగోలుకు కొనేందుకు సిద్ధంగా ఉందని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా.. సఫారీ దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ను పోలిన బౌలింగ్ శైలితోనే కోయెట్జీ ప్రత్యేకంగా నిలుస్తున్నాడని దిగ్గజాలు పేర్కొంటున్నారు. ఇక భారత్ తో జరిగే టీ20లకు, టెస్టులకు జట్టులో స్థానం దక్కించుకున్నాడు కొయెట్జీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి