iDreamPost

U19 WC 2024: దంచికొట్టిన సౌతాఫ్రికా చిచ్చరపిడుగు.. కేవలం 13 బంతుల్లోనే

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో పెను విధ్వంసం నమోదు అయ్యింది. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ.. గ్రౌండ్ ను మెుత్తం హోరెత్తించాడు.

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో పెను విధ్వంసం నమోదు అయ్యింది. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ.. గ్రౌండ్ ను మెుత్తం హోరెత్తించాడు.

U19 WC 2024: దంచికొట్టిన సౌతాఫ్రికా చిచ్చరపిడుగు.. కేవలం 13 బంతుల్లోనే

సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో యంగ్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. అదరగొడుతున్నారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో సౌతాఫ్రికా యువ ఆటగాడు స్టీవ్ స్టోక్ పెను విధ్వంసం సృష్టించాడు. స్కాట్లాండ్ బౌలర్లపై ఓ యుద్దాన్నే ప్రకటించాడు. ఈ క్రమంలోనే టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్ అయిన ఖాసిమ్ ఖాన్ వేసిన ఓవర్లో విశ్వరూపం చూపించాడు.

అండర్-19 వరల్డ్ కప్ లో పెను విధ్వంసం నమోదు అయ్యింది. తాజాగా జరిగిన స్కాట్లాండ్-సౌతాఫ్రికా మ్యాచ్ లో సఫారీ బ్యాటర్ స్టీవ్ స్టోక్ విశ్వరూపం చూపాడు. ప్రత్యర్థి బౌలర్ పై ఎడాపెడా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? చివరి ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయింది. అందులో మూడు రనౌట్లు ఉండటం గమనార్హం. ఇక అనంతరం 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ టీమ్ స్కాట్లాండ్ బౌలర్లను చితక్కొట్టింది. ఓపెనర్ స్టీవ్ స్టోక్ చిన్నపాటి యుద్దాన్నే ప్రకటించాడు. తొలి బంతినే ఫోర్ గా మలిచి తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు.

ఇక ఇన్నింగ్స్ 3వ ఓవర్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు స్టీవ్ స్టోక్ . ఖాసిమ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4, 6 బాది ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే 13 బంతుల్లోనే 50 రన్స్ పూర్తి చేసుకుని టోర్నీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 37 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్స్ లతో 86 పరుగులు చేశాడు. స్టీవ్ ధాటికి 270 పరుగుల లక్ష్యాన్ని కేవలం 27 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించించి సౌతాఫ్రికా. స్టీవ్ స్టోక్ తో పాటుగా మరైస్ 50 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు అద్బుత విజయాన్ని అందించాడు. కాగా.. స్టోక్ క్రీజ్ లో ఉన్నంతసేపు గ్రౌండ్ మెుత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. బ్యాటింగ్ చేసినంతసేపు దంచికొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ కుర్ర ప్లేయర్. మరి అండర్ 19 వరల్డ్ కప్ లో విధ్వంసం సృష్టించిన ఈ యంగ్ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి