iDreamPost

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎమ్మెల్యే కొడుకు, ఎవరో తెలుసా ?

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎమ్మెల్యే కొడుకు, ఎవరో తెలుసా ?

ఎమ్మెల్యే పిల్ల‌లంటే జ‌నంలో ఒక ఇమేజ్. హంగూ, ఆర్భాటాలే గుర్తుకొస్తాయి. ఈ ఎమ్మెల్యే కొడుకు మాత్రం డిఫరెంట్. ఎత్తైన శిఖరాలను క్కడం ఇతనికి చాలా ఇష్టం. అంతేగాదు ఈత, సైక్లింగ్.. ఇలా ఏదో ఒకటి చేస్తాడు. ఐరన్ మ్యాన్ గా గుర్తింపు పొందాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4.15 గంటలకు ఎవరెస్ట్ శిఖ‌రం అంచ‌ను చేరుకొన్నాడు. అతనే ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్‌ రౌత్రాయ్‌ కొడుకు. సిద్ధార్థ్‌ రౌత్రాయ్‌. ఇతను కాలిఫోర్నియా ఫాల్‌సమ్ లో భార్యా, పిల్లలతో ఉంటున్నాడు.

అరుదైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కిన వారిలో తన కొడుకు పేరు నమోదు కావడం గర్వగా ఉందని ఎమ్మెల్యే సురేష్‌కుమార్‌ రౌత్రాయ్‌ తెలిపారు. శిఖరం ఎక్కిన తరువాత భారత పతాకం ఎగురు వేశాడని ఆనందంగా చెప్పాడు. ఇతడిని ఐరన్ మ్యాన్ గా చెప్పుకొంటారు. ఆఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో, ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాలీ, దక్షిణ అమెరికాలోని మౌంట్‌ అకాంకోగువా పర్వత శిఖరాలను అధిరోహించాడు. మూడు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలుగా పేరు ఉంది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న పర్వతాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిద్ధార్థ్‌ రౌత్రాయ్‌ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి