iDreamPost

కుప్పంపై పెద్దిరెడ్డి కన్ను

కుప్పంపై పెద్దిరెడ్డి కన్ను

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ల బండారం బయట్టయలు చేయాలని ఆ జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదలతో ఉన్నారు. పైగా సొంత నియోజకవర్గంలోనే బాబు కొడుకులకు చుక్కలు చూపించాలని పట్టుదలతో ఉన్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

కుప్పం సాక్షిగా బాబు, కొడుకుల అవినీతిని బట్టబయలు చేసేందుకు పంచాయతీరాజ్‌ మంత్రి అయిన పెద్ది రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పంచాయతీ రాజ్‌ శాఖను నారా లోకేష్‌ నిర్వహించారు. ఆ సమయంలో నీరు చెట్టు పథకం ద్వారా తమ్ముళ్లకు దోచిపెట్టారని ఆరోపణలున్నాయి. వీటిపై సోషల్‌ ఆడిట్‌ సాధారణంగా జరిగేదే. అయితే ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి కన్ను కుప్పంపై పడింది. బాబు కొడుకుల కలసి.. ఎంత మేర దోచిపెట్టారనేది వెలికితీసేందుకు సిద్ధమయ్యారు. కుప్పంలో సోషల్‌ ఆyì ట్‌ నిర్వహించాలని ఇటీవల ఆదేశించారు.

సోషల్‌ ఆడిట్‌ ప్రారంభంలోనే మంత్రి అనుకున్నది నిజమైంది. 8 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులపై ఆడిట్‌ నిర్వహించగా భారీగా నిధుల భోంచేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 8 కోట్ల రూపాలయలకు గాను 1.4 కోట్ల రూపాయలు రికవరీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. నీరు చెట్టు వ్యవహారంలో అక్రమాలకు ఆస్కారం ఇచ్చిన ఐదుగురు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ప్రారంభంలోనే ఇంత ఉంటే.. ఇకపోను పోను తవ్వే కొద్ది కుప్పుంలో నీరు చెట్టులో ఎంత మేర అవినీతి బయటపడుతుందోన్న చర్చ సాగుతోంది. మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు చూసిన పంచాయతీ రాజ్‌ శాఖలో ఆయన తండ్రి నియోజకవర్గమైన కుప్పుంలో పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టడాన్ని ప్రస్తుత పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఓ కొలిక్కి తెచ్చేలాగే కనిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి