iDreamPost

వయసు 50 దాటిందా? స్మోక్ చేస్తున్నారా? అయితే క్యాన్సర్ పొంచి ఉంది

వయసు 50 దాటిందా? స్మోక్ చేస్తున్నారా? అయితే క్యాన్సర్ పొంచి ఉంది

పొగ తాగితే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. వయసు మీద బడ్డా క్యాన్సర్ రిస్కు ఎక్కువే! అలాంటిది వయసు పైబడి, పొగ తాగేవాళ్ళకు క్యాన్సర్ ముప్పు ఏ మేరకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓ స్టడీ  ప్రకారం 50 ఏళ్ళు దాటి, స్మోక్ చేసేవాళ్ళకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని వెల్లడైంది. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కరెక్టుగా లేకపోయినా, పోషకాహారం తీసుకోకపోయినా, వ్యాయామం చేయకపోయినా, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా మనం క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. కానీ ఈ కారణాల కంటే వయసు పైబడ్డం, పొగ తాగడాలే ట్యూమర్లు ఏర్పడ్డానికి ఎక్కువగా దోహదం చేస్తాయని ఈ పరిశోధనలో తేలింది.

అమెరికాలోని 4 లక్షల 30 వేల మందిని ఐదేళ్ళ పాటు అతి దగ్గరగా పరిశీలించిన మీదట పరిశోధకులు “క్యాన్సర్”  అనే జర్నల్ లో తమ స్టడీని ప్రచురించారు. శాంపిల్ గా తీసుకున్నవారిలో 15 వేల 226 మందికి ఐదేళ్ళ కాలంలో వివిధ రకాల క్యాన్సర్లు సోకాయి. మగవాళ్ళలో 29 శాతం మంది దీని బారిన పడగా, ఆడవాళ్ళలో ఆ శాతం 25గా నమోదైంది.

మగవాళ్ళు ప్రోస్ట్రేట్, లంగ్ క్యాన్సర్ల బారిన పడగా, ఆడవాళ్ళలో బ్రెస్ట్, యుటిరస్ లలో ట్యూమర్లు డెవలప్ అయ్యాయి. ముసలితనం, పొగ తాగడాలే ఈ క్యాన్సర్లకు మొదటి రెండు కారణాలు. మగవాళ్ళలో మందు తాగడం, కుటుంబీకుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉండడం, రెడ్ మీట్ తినడం, వ్యాయామం లేకపోవడం లాంటి కారణాలు కూడా క్యాన్సర్ వ్యాధిని తెచ్చి పెట్టాయి. ఇక ఆడవాళ్ళలో క్యాన్సర్లకు బరువు పెరగడం, టైప్2 డయాబెటిస్, గర్భ సంచీ తీసేయడం, పిల్లలు పుట్టడం లాంటి కారణాలు దోహదపడ్డాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి