iDreamPost

క్యాన్సర్ కి క్యాపిటల్ గా ఇండియా! సర్వేలో వెల్లడైన భయంకరమైన నిజాలు!

Cancer In India: నేటికాలంలో ప్రపంచం వ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఏ అధ్యాయనం వెల్లడించిన పలు అంశాలు భారత్ ను ఆందోళనకు గురి చేస్తుంది. భారత్ క్యాన్సర్ క్యాపిటల్ గా మారిందని ఆ నివేదిక పేర్కొంది.

Cancer In India: నేటికాలంలో ప్రపంచం వ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఏ అధ్యాయనం వెల్లడించిన పలు అంశాలు భారత్ ను ఆందోళనకు గురి చేస్తుంది. భారత్ క్యాన్సర్ క్యాపిటల్ గా మారిందని ఆ నివేదిక పేర్కొంది.

క్యాన్సర్ కి క్యాపిటల్  గా ఇండియా! సర్వేలో వెల్లడైన భయంకరమైన నిజాలు!

క్యాన్సర్.. ఈ పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన జనాల్లో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. సరైన సమయంలో ఈ వ్యాధిని గుర్తించక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య బాగానే పెరిగిందని వైద్యు నిపుణులు వెల్లడించారు. ఇక క్యాన్సర్ విషయంలో భారత్ కు సంబంధించి ఓ  ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ క్యాపిటల్ గా ఇండియా మారనుందని ఓ సర్వేలో తేలింది. ఇదే విషయం దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తుంది. మరి.. ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ గా మారనుందనే ఆ వార్త వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో క్యాన్సర్ కి సంబంధించిన కేసు బయటకు వస్తూనే ఉంది. గతంలో ఈ వ్యాధి అనేది ఓ వయస్సు వారిలో కనిపించిందే. కానీ నేటికాలంలో మాత్రం అన్ని రకాల వయసు వారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుందటం ఆందోళన కలిగిస్తుందని పలువురు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. 2024 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పీటల్స్  ఇటీవలే ఓ  అధ్యయనం చేశాయి.  ఆ అధ్యయనంలో భారతీయుల మొత్తం ఆరోగ్యం క్షీణించడాన్ని సూచిస్తూ భయంకరమైన గణాంకాలను ఆవిష్కరించింది. 2020లో భారతదేశంలో దాదాపు 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడగా, 2025 నాటికి వారి సంఖ్య  15.7 లక్షలకు పెరుగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది.

అలానే భారత్ లో నమోదవుతున్న క్యాన్సర్  కేసులు ప్రపంచంలో నమోదవుతున్న రేట్లను మించి ఉందని తేలింది. అలా ప్రపంచ క్యాన్సర్ రాజధాని బిరుదును సంపాదించింది. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు ప్రధానంగా సంభవిస్తాయి. అలానే పురుషులలో ఊపిరితిత్తులు, నోరు, ప్రోస్ట్రేట్ క్యాన్సర్ పురుషులలో ప్రధానంగా ఉన్నాయి. ఇటీవలే విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న దాదాపు 98 శాతం మంది మహిళలు ముందస్తుగా గుర్తించడం ద్వారా మనుగడ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది తేలింది. కాబట్టి ముందస్తు స్క్రీనింగ్ మరియు శ్రద్ధగల పర్యవేక్షణ యొక్క కీలక పాత్రను ఈ అధ్యాయనం నొక్కి చెబుతుంది.

భారతీయుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రీ-డయాబెటిక్, ముగ్గురిలో ఇద్దరు ప్రీ-హైపర్‌టెన్సివ్, అలానే ప్రతి పది మందిలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని నివేదికలో పేర్కొనబడింది. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం.. ఇతర దేశాలతో పోల్చితే, భారతదేశంలో క్యాన్సర్ నిర్ధారణ వయస్సు 60 మరియు 70 లలో కాకుండా, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలకు సగటు వయస్సు 52, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు 54, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు 59 వయస్సుని పేర్కొంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న ఫైట్ కు ప్రధాన సమస్య సరిపడని స్కీనింగ్ రేట్లు. ఇవి గ్లోబల్ బెంచ్ మార్క్ ల కంటే చాలా తక్కువగా ఉందని చెబుతుంది. స్కీనింగ్ రేటు అనేది క్యాన్సర్ నివారణ చర్యల్లో ముఖ్యమైన అవసరాన్ని నొక్కి చెబుతుంది.

India is best for cancer curing

అపోలో నివేదిక మానసిక ఆరోగ్య రుగ్మతల పెరుగుదలను ప్రధానంగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల గల వారిలో డిప్రెషన్ ఒక ప్రధాన సమస్యగా ఉందని తేల్చింది. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఐదు మందిలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఈ అధ్యాయనం తెలిపింది. ఇది అందరిని ఆదోంళకు గురి చేస్తున్న అంశమేనన పలువు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డిప్రెషన్ కారణంగా రక్తపోటు, మధుమేహం పెరుగుదలకు దోహదం చేస్తుంది, ముఖ్యంగా డిప్రెషన్ అనేది మహిళలను ప్రభావితం చేస్తుందని తేలింది.

అలానే ప్రతి నలుగురిలో ముగ్గురు వ్యక్తులు ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నారని అధ్యాయనంలో వెల్లడించింది. వీటిపాటు  ఆందోళన కలిగించే మరో అంశాన్ని ఈ అధ్యాయనం పేర్కొంది. యువతలో అధిక రక్తపోటు, ప్రీడయాబెటిస్  ఎక్కువగా పెరుగుతుందని నివేదిక సూచిస్తుంది. భారతదేశంలో 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 20 శాతం మంది ప్రీడయాబెటిస్ బారిన పడ్డారని నివేదిక పేర్కొంది. మొత్తంగా ప్రపంచంలోని ‘క్యాన్సర్ క్యాపిటల్’ అనే బిరుదును సమర్థంగా కలిగి ఉండేలా భారత్‌ ఉద్భవించిందని నివేదిక హైలైట్ చేస్తుంది. మరి.. ఈ నివేదిక తెలిపిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి