iDreamPost

థియేటర్ లో పోటీపడి.. ఓటిటిలో వేరు పడ్డాయి! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Author ajaykrishna Published - 08:16 PM, Fri - 27 October 23

ఈరోజుల్లో ఎవరి సినిమాలైనా నెల రెండు నెలల్లోనే ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇటీవల సెప్టెంబర్ చివరిలో లాంగ్ వీక్ దొరకడంతో దాదాపు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే.. ఈ మూడు సినిమాలు థియేట్రికల్ పోటీపడినా.. ఓటిటిలో మాత్రం వేర్వేరు డేట్స్ లో వస్తున్నాయి.

ఈరోజుల్లో ఎవరి సినిమాలైనా నెల రెండు నెలల్లోనే ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇటీవల సెప్టెంబర్ చివరిలో లాంగ్ వీక్ దొరకడంతో దాదాపు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే.. ఈ మూడు సినిమాలు థియేట్రికల్ పోటీపడినా.. ఓటిటిలో మాత్రం వేర్వేరు డేట్స్ లో వస్తున్నాయి.

  • Author ajaykrishna Published - 08:16 PM, Fri - 27 October 23
థియేటర్ లో పోటీపడి.. ఓటిటిలో వేరు పడ్డాయి! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

థియేట్రికల్ రిలీజ్ అయిపోయాక సినిమాలన్నీ ఓటిటి బాటపడతాయనే సంగతి తెలిసిందే. కొంచం వెనకాముందు అయినా ఎలాగోలా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంటాయి. అందులో స్టార్స్ నుండి యంగ్ హీరోల వరకు అందరి సినిమాలు ఒకటే. ఎందుకంటే.. ఈరోజుల్లో ఎవరి సినిమాలైనా నెల రెండు నెలల్లోనే ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇటీవల సెప్టెంబర్ చివరిలో లాంగ్ వీక్ దొరకడంతో దాదాపు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకు కారణం.. సలార్ వాయిదా పడటం. ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి అనౌన్స్ చేసిన డేట్ నుండి వాయిదా పడి మరీ సలార్ డేట్ కి వచ్చాయి రెండు సినిమాలు. అవే స్కంద, చంద్రముఖి 2.

ఇవి రెండు ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు. సడన్ గా సలార్ వాయిదా పడటంతో ఆ డేట్ కి.. సెప్టెంబర్ 28కి షిఫ్ట్ అయిపోయాయి. అయితే.. ఆ రోజు స్కంద, చంద్రముఖి 2 ఒకేరోజు రిలీజ్ అవ్వగా.. ఆ తర్వాత రోజే పోటీలో చేరింది పెదకాపు 1. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తీసుకొని.. యంగ్ హీరోని పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక స్కంద విషయానికి వస్తే.. రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ మూవీపై మేకర్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రామ్ తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నాడు.

ఎందుకంటే. స్కంద మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేశారు. రామ్ కెరీర్ లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఫస్ట్ మూవీ ఇదే. యాక్షన్ పరంగా.. ఫైట్స్ పరంగా మంచి టాక్ వచ్చినప్పటికి.. బోయపాటి మాస్ రామ్ కు హిట్ ఇవ్వలేకపోయింది. బట్.. రామ్ ని ఊరమాస్ రేంజ్ లో ప్రెజెంట్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంది. ఇక సూపర్ స్టార్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ అంటూ వచ్చిన చంద్రముఖి 2. లారెన్స్ హీరోగా ఒరిజినల్ డైరెక్టర్ పి. వాసు తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డివైడెడ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ మూడు సినిమాలు థియేట్రికల్ పోటీపడినా.. ఓటిటిలో మాత్రం వేర్వేరు డేట్స్ లో వస్తున్నాయి. చంద్రముఖి 2 నెట్ ఫ్లిక్స్ లో.. పెదకాపు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ.. స్కంద మాత్రం కాస్త ఆలస్యంగా రానుందట. డిస్నీ హాట్ స్టార్ వారు స్కంద రైట్స్ దక్కించుకోగా.. దీపావళికి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడు సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి