iDreamPost

ప్రైమ్ లో మాయం – 30 కోట్ల నష్టం

ప్రైమ్ లో మాయం – 30 కోట్ల నష్టం

సినిమా పరిశ్రమలో కాపీ కథలు కొత్తేమి కాదు. ఫలానా మూవీ నేను గతంలో రాసుకున్న పాయింట్ ఆధారంగా తీశారని గతంలో ఎందరో రచయితలు కోర్టు మెట్లు ఎక్కిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని బయటే సెటిల్ మెంట్ కాగా కొన్ని తీర్పు వచ్చేదాకా సాగదీసుకుంటూ ఉంటాయి. ఇది మొదటి కోవలోకి వచ్చే కేసు. శివ కార్తికేయన్ హీరోగా ఇటీవలే తెలుగులో ‘శక్తి’ అనే డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది గుర్తుందిగా. కరోనా వల్ల థియేట్రికల్ రిలీజ్ సాధ్యం కాకపోవడంతో నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. స్పందన కూడా భారీగానే ఉందట.

దీని ఒరిజినల్ తమిళ వర్షన్ పేరు ‘హీరో’. అక్కడ హిట్ క్యాటగిరిలో పడింది. విశాల్ అభిమన్యుడు ఫేం మిత్రన్ దర్శకుడు. ఇప్పుడు ఇది కాపీ రైట్ చిక్కుల్లో ఇరుక్కుంది. విజిల్ డైరెక్టర్ అట్లీ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న బాస్కో ప్రభు హీరో కథ తనదని గతంలోనే రిజిస్టర్ చేసుకున్నానని తనకు చెప్పకుండా కాపీ కొట్టేసి కోట్లు గడించారని ఫిర్యాదు చేస్తూ రైటర్ అసోసియేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు. మొత్తం పరిశీలించిన అధ్యక్షుడు భాగ్యరాజ్ ప్రభు చెప్పిందాంట్లో నిజముందని, రెండు కథల్లో చాలా సారూప్యతలు ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇప్పుడీ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది.

అధికారిక ధ్రువీకరణ ప్రభు దగ్గర ఉండటంతో న్యాయస్థానం తీర్పు ఇస్తూ వెంటనే ప్రైమ్ లో దీన్ని తీసేయడంతో పాటు హక్కులు కొన్న సన్ నెట్ వర్క్ దీన్ని టెలికాస్ట్ చేయకూడదని స్టే ఇచ్చింది. చెన్నై టాక్ ప్రకారం హీరో హక్కుల కోసం ప్రైమ్ 20 కోట్లు, సన్ టీవీ 12 కోట్ల దాకా చెల్లించాయట. ఒకవేళ పైకోర్టులో కూడా జడ్జ్ మెంట్ హీరో యూనిట్ కు వ్యతిరేకంగా వస్తే ఈ మొత్తాన్ని వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతే కాదు తెలుగు డబ్బింగ్ వెర్షన్ హక్కుల సొమ్మును రిటర్న్ చేయాలి. దర్శకుడు మిత్రన్ మాత్రం ఇద్దరికీ ఒకే ఐడియా వస్తే దాన్ని కాపీ అని ఎలా అంటరాని వాదిస్తున్నారు. ఎంత లేదన్నా 30 కోట్లకు పైగా వెనక్కు ఇవ్వాలి. పై కోర్టుకు వెళ్లే విషయంలో హీరో యూనిట్ సీరియస్ చర్చల్లో ఉంది. కానీ బాస్కో ప్రభు దగ్గర ఆధారాలు బలంగా ఉండటంతో ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి