iDreamPost

ప్రెజర్ కుక్కర్ అనుభవం చెప్పిన గీతరచయిత

ప్రెజర్ కుక్కర్ అనుభవం చెప్పిన గీతరచయిత

“ప్రెజర్ కుక్కర్ అనుభవం పెళ్లైన అందరికీ ఉంటుంది. మూడు విజిల్స్ వస్తే సిమ్ములో పెట్టమని చెప్తారు. కానీ ఈ ప్రెజర్ కుక్కర్ అలా కాదు. 30-40 విజిల్స్ మోగుతూనే ఉంటాయట థియేటర్లో. సిమ్ములో పెట్టడం కష్టం. ఈ విషయం ఆల్రెడీ చూసిన కొందరు చెప్తున్నారు. కాబట్టి ఇది “ప్లెజర్” కుక్కరే కానీ “ప్రెజర్ కుక్కర్” కాదు” అని మైకట్టుకుని చెప్పాడు గీత రచయిత సిరాశ్రీ.

సుజోయ్-సుశీల్ అనే జంట దర్శకులు తీసిన “ప్రెజర్ కుక్కర్” అనే సినిమా ప్రీ రిలీజ్ పండగ చేసుకుంది. ఈ వేడుకలో ఈ సినిమాని మరీ ఈ రేంజులో ఎత్తి కుదేశాడు. ఇందులో “చెలి చెలి” అనే కైలాష్ ఖేర్ పాడిన పాటని రాసింది సిరాశ్రీ యే. నిజంగా ఈ వేదికలమీద చెప్పిన మాటలన్నీ నిజాలేనా అంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు. “పబ్లిసిటీ ఇది సినిమా వాళ్ల యాక్టివిటీ” అని అనుకుంటూ రిలీజ్ వరకు వేచి చూడాలంతే.

కామెడీ టచ్చుతో వస్తున్న ఈ సినిమా ఈ నెల 21న విడుదలౌతోంది. ఏమో! ఒక్కోసారి టార్గెట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందంటే ఎవరు మాత్రం ఆపగలరు? పెళ్లిచూపులు, ఈ రోజుల్లో, హుషారు, ఆరెక్స్ 100..ఇలా అంచనాల్లేకపోయినా విరగబడి ఆడేసినవి లేవు.

అన్నట్టు ఈ సినిమా గురించి ఇదే వేదిక మీద తనికెళ్ళ భరణి కూడా గొప్పగా చెప్పారు. ఏమౌతుందొ చూడాలి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి