iDreamPost

Single-use plastic ban జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం

Single-use plastic ban జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం

జూన్ 01వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి రానుంది. ఉత్పత్తి దారులు, దుకాణ దారులు, వీధుల్లో వ్యాపారం నిర్వహించే వారితో పాటు, ప్రజలకు ఇటీవలే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పలు సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక‌పై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గా పరిగణించే వస్తవులపై నిషేధం అమల్లోకి రానుంది. ఇయర్ బడ్, జెండాలు, మిఠాయిలు, ఐస్ క్రీమ్ స్టిక్, అలంకరణకు ఉపయోగించే థర్మకోల్, 100 మైక్రాన్ ల కంటే మందలం కలిగిన పీవీసీ బ్యానర్ లు, కప్పులు, ఇతరత్రా వాటిని ఇక‌పై వాడ‌కూడ‌దు.

దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 01వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఢిల్లీ సెక్రటేరియట్ లో వీటిపై నిషేధం విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ ప్రాంగణంలో బ్యానర్లు, పోస్టర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన కత్తిపీటలను కూడా నిషేధించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కాలుష్యాన్ని ఎదుర్కొవడానికి పర్యావరణ శాఖ తగిన చర్యలు తీసుకొంటోందని, కాలుష్య స్థాయిలను ఎదుర్కొవడానికి ప్లాన్ ను కూడా ప్రారంభించిందన్నారు. ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్ లు, స్ట్రాలు, పాలథీన్, ప్లాస్టిక్ గ్లాసులు..ఇతరత్రా ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ లతో తయారుచేస్తారు. ఇవి మళ్లీ వాడ‌లేం. చాలా మంది ప్లాస్టిక్ వస్తువులను వాడిన త‌ర్వాత నేల‌మీదే పారేస్తారు. వాటిని కాల్చ‌డం వ‌ల్ల‌ ఫలితంగా గాలి, నీరు, భూమి కాలుష్యమౌతోందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ ఉపయోగించే వాటిని ప్రోత్సాహిస్తామని, బ్యానర్లు, పోస్టర్ల విషయంలో పేపర్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి